Home / 18+ / రాజధానిలో గృహ ప్రవేశానికి ముహూర్తం ఫిక్స్ మరికొద్ది రోజులే..

రాజధానిలో గృహ ప్రవేశానికి ముహూర్తం ఫిక్స్ మరికొద్ది రోజులే..

ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిలో గృహ ప్రవేశం చేసేందుకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం.. గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్ రోడ్డుకి సమీపంలో నిర్మించిన ఇంట్లోకి ఫిబ్రవరి 14 వ తేదీన వైఎస్ జగన్ గృహ ప్రవేశం చేయనున్నట్లు సమాచారం.. ఇందుకు ముహూర్తం కూడా నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 14 వ తేదీ ఉదయం 8:21 నిమిషాలకు రాజధానిలోని శాశ్వత నివాసంలోకి రానున్నట్లు సమాచారం.. ఏదైనా జగన్మోహన్ రెడ్డి రాజధాని నుంచే రాజకీయం ప్రారంభిస్తుండడం పట్ల ఆపార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.