Home / shyam (page 110)

shyam

కత్తులతో తెలుగు తమ్ముళ్ల వీరంగం..పల్నాడులో బయటపడిన బాబు బండారం..!

పల్నాడులో వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ…పునరావాస కేంద్రాలు తెరిచి…ఛలో ఆత్మకూరు అంటూ చంద్రబాబు డ్రామాలు ఆడిన సంగతి తెలిసిందే. గ్రామస్థాయిలో జరిగిన వ్యక్తిగత కక్షలకు రాజకీయ రంగు పులిమి వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి చంద్రబాబు కుటిల ప్రయత్నాలు చేశాడు. అయితే పోలీసులు ఇరువర్గాలతో మాట్లాడి పునరావాస కేంద్రాల్లోని టీడీపీ కార్యకర్తలను వాళ్ల ఊళ్లకు పంపించారు. దీంతో ప్రస్తుతం ఈ వివాదం సద్దుమణిగింది. అయితే పల్నాడులో టీడీపీ …

Read More »

జనసేనానిపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ జబర్దస్త్ పంచ్..!

జగన్ 100 రోజుల పాలనపై శనివారం నాటి ప్రెస్‌మీట్‌లో జనసేన అధ్యక్షుడు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జనసేనాని ఆరోపణలపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా వైసీసీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. పార్టీ అధ్యక్షుడిగా పోటీచేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్…వైసీపీ ప్రభుత్వం వచ్చి 100 రోజులు కూడా కాకముందే సీఎం జగన్ ను విమర్శించాలని తపన పడడం …

Read More »

పవన్ కల్యాణ్ పరువు అడ్డంగా తీసిన వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా..!

తనదైన అగ్రెసివ్ డైలాగులతో, పదునైన విమర్శలతో, పంచ్‌ డైలాగులతో ప్రత్యర్థులను చెడుగుడు ఆడుకునే వైసీపీ నేతల్లో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ముందు వరుసలో ఉంటారు. గత ఐదేళ్లలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా దూకుడుగా వ్యవహరిస్తూ… సమయం వచ్చినప్పుడల్లా చంద్రబాబు, లోకేష్‌ల‌‌‌‌పై రాజకీయంగా తీవ్ర విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచేది ఈ వైసీపీ ఫైర్ బ్రాండ్. అయితే ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా రాజకీయ విమర్శలు …

Read More »

తిరుమల మెట్ల మార్గంలో టీటీడీ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీ…!

టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమల పలు విప్లవాత్మక మార్పులు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలు రద్దు, వయోవృద్ధులకు 30 నిమిషాల్లోనే ఉచిత దర్శనం వంటి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇవాళ తిరుమలకు వెళ్లే  మెట్ల మార్గంలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కొండపైకి వెళ్లే మెట్ల మార్గంలో ఉన్నటువంటి షాపులను, మరుగుదొడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో …

Read More »

కొద్ది రోజులు ఓపిక పట్టు ఉమా.. మీ వేల కోట్ల దోపిడీ అంతా బయటకు వస్తుంది..!

టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌ల విమర్శలకు తనదైన స్టైల్లో పదునైన పంచ్ డైలాగులతో, సెటైర్లతో  కౌంటర్ ఇచ్చే వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ విజయసాయిరెడ్డి… తాజాగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమకుపై విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమల ఆధ్యర్యంలో పోలవరం ప్రాజెక్టు టెండర్లలో భారీ అవినీతి జరిగిందని అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ తీవ్రంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. …

Read More »

చంద్రబాబుకు షాక్…వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులు..!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే సుజనా, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్ వంటి కీలక నేతలంతా బీజేపీలో చేరగా అన్ని జిల్లాల్లో టీడీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల వైపు చూపుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నాయకులు, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇవాళ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి …

Read More »

తిరుమలలో వయో వృద్ధులకు ఉచిత దర్శనం..సమయాలు ఇవే..!

టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల విఐపీలకు బ్రేక్ దర్శనాలు కల్పించే ఎల్1, ఎల్‌2, ఎల్‌3 లను రద్దు చేశారు. దేవుడి ముందు అందరూ సమానమే అని ప్రకటించారు. తాజాగా తిరుమలలో 60 సంవత్సరాలు దాటిన వయో వృద్ధులకు 30 నిమిషాల్లో ఉచిత దర్శనం చేయించనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి …

Read More »

ఏపీ లోకాయుక్తగా జస్టిస్ పి. లక్ష్మణ్ రెడ్డి ప్రమాణ స్వీకారం..హాజరైన సీఎం జగన్..!

ఏపీలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అవినీతి నిరోధానికి సీఎం జగన్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా లోకాయుక్త పదవికి జస్టిస్ పి. లక్ష్మణ్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఏపీ లోకాయుక్తగా జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డి పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఇవాళ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 11 గంటలకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆయనచే ప్రమాణ స్వీకారం చేశారు. ఐదేళ్ల పాటు …

Read More »

పీవోకేలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌‌ఖాన్‌‌కు ఘోర అవమానం..!

కశ్మీర్‌‌లో వివాదాస్పద ఆర్టికల్ 370 ని మోదీ సర్కార్ రద్దు చేయడంతో పాకిస్తాన్‌ షాక్‌కు గురైంది. కశ్మీర్ అంశంపై ప్రపంచ దేశాల్లో భారత్‌ను దోషిగా నిలబెట్టాలన్న పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కుయుక్తులు ఫలించలేదు. ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచదేశాలన్నీ కశ్మీర్ భారత్ అంతర్భాగం అని..తేల్చి చెప్పాయి. దీంతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ భారత్‌పై యుద్ధం చేస్తామని, అణుబాంబులతో దాడులు చేస్తామని బీరాలు పలుకుతున్నాడు. కశ్మీర్ తర్వాత భారత్ తదుపరి లక్ష్యం పాక్ …

Read More »

నల్లమల అడవుల్లో యురేనియం మైనింగ్‌కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు..మంత్రి కేటీఆర్ ప్రకటన…!

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని విపక్షాలు రాద్ధాంతం చేస్తున్న దరమిలా ఇవాళ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… నల్లమల అడవుల్లో యురేనియం మైనింగ్‌కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు..ఇక నుంచి ఇవ్వబోము అని స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. యురేనియం నిక్షేపాల కోసం నాగర్‌కర్నూల్‌- ఆమ్రాబాద్‌ ప్రాంతంలో ఎలాంటి అన్వేషణ చేపట్టలేదని, యురేనియం తవ్వకాలకు …

Read More »