Home / Tag Archives: Andhra Pradesh

Tag Archives: Andhra Pradesh

మాచర్ల ‎ఘటనపై టీడీపీ రాజకీయం..మంత్రి కన్నబాబు ఫైర్..!

మాచర్ల ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలపై ఏపీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. తాజాగా కాకినాడ వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీడియాతో కన్నబాబు మాట్లాడుతూ చంద్రబాబు మాచర్ల ఘటనపై స్పందించారు. తొలుత సీఎం జగన్‌పై మంత్రి కన్నబాబు ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సంస్కరణలు వైఎస్సార్‌సీపీని ఒక చారిత్రక పార్టీగా తీర్చిదిద్దబోతున్నాయని పేర్కొన్నారు. పట్టుదల కలిగిన నాయకుడు పార్టీని …

Read More »

ఏబీవీ సస్పెన్షన్‌పై మంత్రి బొత్స కామెంట్స్…!

ఏపీలో గత టీడీపీ హయాంలో భద్రతా పరికరాల కొనుగోలులో పలు అవకతకలకు పాల్పడడంతో పాటు, దేశభద్రతకు సంబంధించిన సమాచారాన్ని విదేశీ కంపెనీలతో పంచుకున్న ఆరోపణలపై ఇంటెలిజెన్స్ శాఖ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావును వైసీపీ ప్రభుత్వం సస్సెండ్ చేసింది. అయితే తనకు అత్యంత సన్నిహితుడైన ఏబీ వెంకటేశ్వరావును సస్పెండ్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వం ఫాక్షనిస్ట్‌గా వ్యవహరిస్తుందంటూ, అధికారులను కూడా వేధిస్తుందంటూ..తీవ్ర విమర్శలు చేశారు. …

Read More »

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై కేంద్రం స్టాండ్ ఇదే.. కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై ఏపీ బీజేపీ నేతల్లో గందగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ..ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అమరావతిలో దీక్ష చేశారు. ఇక బాబు సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అయితే అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదు..రాజధాని తరలిస్తానంటే కేంద్రం చూస్తూ వూరుకోదంటూ…బీరాలు పలుకుతున్నారు.. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీయల్, ఎంపీ సీఎం …

Read More »

బిగ్ బ్రేకింగ్.. ట్రాన్స్‌కాయ్ అవినీతి బాగోతం.. 250 కోట్ల కుంభకోణంలో టీడీపీ పెద్దలు..?

టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు‌కు చెందిన ట్రాన్స్‌కాయ్ సంస్థపై సీబీఐ దాడుల నేపథ్యంలో 250 కోట్ల భారీ అవినీతి కుంభకోణం బయడపడడం రాజకీయంగా పెను సంచలనం రేపుతోంది. ట్రాన్స్‌కాయ్ సంస్థ చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టులో హెడ్‌వర్క్స్‌ పనులను దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పట్లోనే రాయపాటికి చెందిన ట్రాన్స్‌కాయ్ సంస్థ శక్తి సామర్థ్యాలపై పలు అనుమానాలు తలెత్తాయి. పోలవరం లాంటి భారీ ప్రాజక్టును నిర్మించే నైపుణ్యం, సమర్థత …

Read More »

పవన్ పై ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవ నాయకులు పోలీస్ కంప్లైంట్

ఇటీవల తిరుపతిలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విజయవాడ కృష్ణ నది తీరాన జరిగిన క్రైస్తవ సాంప్రదాయ ఆచరణ గూర్చి వివాస్పద వ్యాఖ్యలు చేస్తూ క్రైస్తవుల మనోభవాలను దెబ్బతీస్తూ రెండు మతాల మధ్య చిచ్చుపెటే ప్రయత్నం చేసారు . దీనిని తీవ్రంగా ఖండిస్తూ పవన్ కళ్యాణ్ పై విశాఖలో క్రైస్తవ నాయకులు ధ్వజమెత్తారు. 1⃣. మూకుమ్మడి మతమార్పిడి జరిగింది, ముఖ్య మంత్రికి తెలియదా అని పవన్ ప్రశ్నించారు – దీని గురించి …

Read More »

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు..లోకేష్, అచ్చెన్నాయుడులకు ప్రివిలేజ్ నోటీసులు..!

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్, ఎమ్మెల్యే అచ్చెంనాయుడు, మరో టీడీపీ నేత కూన రవికుమార్‌లకు సభా హక్కుల ఉల్లంఘన కింద..అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. కాగా అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వ సాయం అందజేస్తున్న సమయంలో స్పీకర్ తమ్మినేని అగ్రిగోల్డ్ ఆస్తులను, హాయ్‌ల్యాండ్‌ను లోకేష్‌ కొట్టేయాలని ప్రయత్నించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. …

Read More »

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జేకే మహేశ్వరి!

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ జె.కె.మహేశ్వరిని నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఆయన పేరును కేంద్రానికి సిఫారసు చేసింది. జస్టిస్‌ మహేశ్వరి ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ హైకోర్టులో నంబర్‌ టూ స్థానంలో కొనసాగుతున్నారు. వాస్తవానికి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం గతంలో కేంద్రానికి సిఫారసు చేసింది. కేంద్రం ఆ సిఫారసును వెనక్కి పంపింది. ఈ నేపథ్యంలో తాజాగా భేటీ అయిన సుప్రీం కోర్టు …

Read More »

రాజధానిపై బొత్స వ్యాఖ్యలు… నాడు బాబు చెప్పినవే..ఇవిగో సాక్ష్యాలు…!

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజధానిని అమరావతిని నుంచి దొనకొండకు తరలిస్తారంటూ.. టీడీపీ, ఎల్లోమీడియా దుష్ప్రచారం మొదలుపెట్టింది. ఇటీవల కృష్ణా నదికి వరదలు వచ్చిన నేపథ్యంలో కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇంటితో సహా, అమరావతిలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో అమరావతికి వరద ముంపు ప్రమాదం ఉంది కాబట్టి..కాలువలు, డ్యామ్‌లు, పెద్ద ఎత్తున నిర్మించాల్సి వస్తుందని… లక్ష రూపాయలు అయ్యే …

Read More »

రాజులు మంచివాళ్లు అయితే రాజ్యాలు సుభిక్షం..!

పాలించే రాజులు ప్రజా క్షేమాన్నికాంక్షించే సుపరిపాలకులు అయితే…ఆయా రాజ్యాలు సుభిక్షంగా ఉంటాయి అనే నానుడికి తెలుగు రాష్ట్రాల సీఎంలను చూస్తే అర్థమవుతుంది. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నిండక ఎన్నేళ్లయింది… నాగార్జుసాగర్ గేట్లు తెరుస్తమని ఏనాడైనా అనుకున్నమా…..ముఖ్యంగా తెలంగాణలో కృష్ణమ్మ పరుగులు పెడుతుంటే చూసి మురిసి ఎన్నేళ్లు అయింది…జీవనది లాంటి కృష్ణమ్మ జాడ లేక…తెలుగు రాష్ట్రాలు ఎంతగా విలవిలలాడిపోయాయి. కానీ ఈసారి గోదావరి గంగమ్మ గలగలా పారుతుంటే…కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతుంటే …

Read More »

వర్షాలు కురుస్తుండడంతో నారుమడులు వేస్తున్న రైతులు.. పచ్చదనం సంతరించుకుంటున్న పొలాలు

మొన్నటి దాకా వర్షాలులేక ఎదురు చూస్తున్న తెలుగురాష్ట్రాల్లో వర్షాలు స్వాగతం పలికాయి. రేపటినుంచి తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాజస్థాన్‌ నుంచి మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా ఒడిశావరకు ఉపరితల ధ్రోణి విస్తరించడంతో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. దీంతో విస్తారమైన వర్షపాతం నమోదవుతోంది. తాజాగా రెండురోజుల నుంచి కురుస్తోన్న తేలికపాటి జల్లులతో భాగ్యనగరం తడిసిముద్దయ్యింది. ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి స్వాంతన చేకూరింది. …

Read More »