Breaking News
Home / Tag Archives: satires

Tag Archives: satires

అపర రాజనాల చంద్రబాబు…వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ హాట్ కామెంట్స్..!

సినిమాల్లో నందమూరి వారసులు హీరోలైతే..రాజకీయాల్లో చంద్రబాబు మహానటుడు..ఈ మాట స్వయంగా స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారు. తన పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచి, సీఎం కుర్చీని, పార్టీని, ఆస్తులను లాక్కోవడం కాదు..ఆ‌ఖరకు తన పిల్లలను కూడా దూరం చేసిన చంద్రబాబు తనను మించిన మహానటుడు అని ఎన్టీఆర్ అప్పట్లో ఎంతో ఆవేదనతో అన్నారు. నిజమే రాజకీయాల్లో చంద్రబాబు నటన చూస్తే నెవ్వర్ బిఫోర్..ఎవ్వర్ ఆఫ్టర్…రాజకీయాల్లో బాబులా నటించే నాయకులే లేరని చెప్పాలి. …

Read More »

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై అచ్చెన్నాయుడు కామెంట్స్‌..రోజా సెటైర్లు..!

అచ్చెన్నాయుడు…టీడీపీ మాజీమంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అయిన ఈయనగారికి కాస్త నోటిదురుసు ఎక్కువ. గత చంద్రబాబు హయాంలో నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై అవాకులు, చెవాకులు పేలేవారు. ఇప్పటికీ సమయం, సందర్భం లేకుండా సీఎం జగన్‌పై, వైసీపీ నేతలపై నోరుపారేసుకుంటూ ఉంటారు.అందుకే జగన్‌తో సహా వైసీపీ నేతలు అచ్చెన్నాయుడిని పదేపదే టార్గెట్ చేస్తూ సెటైర్లతో చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సభలో రంకెలు వేస్తున్న అచ్చెన్నాయుడిపై..అచ్చెన్నా కూర్చో..కూర్చో..ఒళ్లు పెరగడం కాదు…కాస్త …

Read More »

లోకేష్ సిగ్గుమాలిన ట్వీట్‌… మళ్లీ అడ్డంగా దొరికిపోయాడుగా…!

నారావారి పుత్రరత్నం, ట్విట్టర్ పిట్ట నారా లోకేషం సారు ట్విట్టర్‌లో మహా యాక్టివ్…పొద్దున్నే లేవగానే రోజూ ట్విట్టర్‌లో జగన్‌పై ఏదో ఒక కూతెట్టడం..అదిగో మా చినబాబు చించేశారు..జగన్‌ను చెడుగుడు ఆడేసాడు..అని తెలుగు తమ్ముళ్లు, ఎల్లో మీడియా ఛానళ్లు బట్టలు చించుకోవడం కామన్‌ అయిపోయింది..అయితే ట్విట్టర్‌లో జగన్‌‌ను తిట్టబోయే తొందరలో ఏదో ఒకటి గబుక్కున ట్వీటడం నెట్‌జన్లకు అడ్డంగా దొరికిపోవడం కూడా చినబాబుకు అలవాటుగా మారిపోయింది. తాజాగా జగన్‌పై ఓ సిగ్గుమాలిన …

Read More »

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్..వైరల్..!

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలో పర్యటిస్తూ మద్యం రేట్లపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ మందుబాబులను వెనకేసుకువచ్చారు. ఏం తమ్ముళ్లు..మద్యం రేటు పెరిగిందా..పెరిగిందా లేదా..కావాల్సిన బాండ్లు ఉన్నాయా లేదా..ఏదో ఒక బలహీనతతో  ఒక పెగ్గేసుకునేవాళ్లకు..ఈ పనిష్మెంట్ ఏంటీ..ఈ శిక్ష ఏంటీ అని అడుగుతున్నా అంటూ రంకెలు వేసాడు. దీంతో బాబుగారు టీడీపీ అధ్యక్షుడా..లేక తాగుబోతుల సంఘం అధ్యక్షుడా అంటూ నెట్‌జన్లు చెడుగుడు ఆడేసుకుంటున్నారు. …

Read More »

ఆస్తుల ప్రకటనపై అసలు నిజం ఒప్పుకున్న చంద్రబాబు..ఇదిగో వీడియో సాక్ష్యం..!

ఐటీ దాడుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ హడావుడిగా తమ కుటుంబ ఆస్తులను ప్రకటించాడు. తన తండ్రి చంద్రబాబు ఆస్తి 9 కోట్ల రూపాయలని, అప్పులు 5.13 కోట్లు అని, గత ఏడాది కంటే ఈ ఏడాది మా నాన్నగారి ఆస్తి 87 లక్షల రూపాయలు పెరిగినట్లు లోకేష్ చెప్పుకొచ్చారు. ఇక తన తల్లి సతీమణి నారా భువనేశ్వరి ఆస్తి 50 కోట్లని, తనకు …

Read More »

బ్రేకింగ్…కుటుంబ ఆస్తుల వివరాలు ప్రకటించిన నారా లోకేష్…!

టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిపిన ఐటీ సోదాల్లో 2 వేల కోట్ల మేర అక్రమలావాదేవీలు జరిగాయని, హవాలా, మనీలాండరింగ్ ద్వారా వేల కోట్ల అవినీతి జరిగిందని ఐటీ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో అమరావతి నుంచి హవాలా ద్వారా 400 కోట్ల అక్రమ సొమ్ము కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్‌పటేల్‌కు ఖాతాకు చేరాయని , వీటిపై సమాధానం చెప్పాలని ఐటీ శాఖ …

Read More »

టీడీపీ ప్రజా చైతన్య యాత్రపై రోజా జబర్దస్త్ పంచ్..!

టీడీపీ అధినేత చంద్రబాబు పొద్దున లేస్తే ఐటీని నేనే కనిపెట్టా..సెల్‌ఫోన్ నేనే కనిపెట్టా..కంప్యూటర్‌ను నేనే కనిపెట్టా..అంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఐటీ పేరు వింటేనే గజగజా వణికిపోతున్నాడంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా తనదైన స్టైల్లో పంచ్‌‌లు వేశారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రజా చైతన్యయాత్రపై రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబుది ప్రజాచైతన్య యాత్ర కాదు.. పిచ్చోడి యాత్ర అని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం వచ్చి 9 …

Read More »

2 వేల కోట్ల స్కామ్‌..చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు పీఎస్‌ శ్రీనివాస్‌‌‌పై జరిపిన సోదాల్లో దాదాపు 2 వేల కోట్ల స్కామ్ బయటపడిందని…ఐటీ శాఖ  ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ 2 వేల కోట్ల స్కామ్‌పై ఏపీ రాజకీయాల్లో పెను దుమారం చెలరేగుతోంది. అయితే శ్రీనివాస్‌‌‌‌పై జరిగిన ఐటీదాడులకు, చంద్రబాబుకు సంబంధం ఏంటని బుకాయించిన టీడీపీ నేతలు, ఎల్లోమీడియా ఛానళ్లు..ఇప్పుడు మాట మార్చాయి. కేవలం 2 లక్షలు దొరికితే 2 వేల కోట్ల అవినీతి …

Read More »

చంద్రబాబు, ఎల్లోమీడియాపై విజయసాయిరెడ్డి సెటైర్లు…సోషల్ మీడియాలో వైరల్..!

ఢిల్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విక్టరీ కొట్టి మూడోసారి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ఫిబ్రవరి 1న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మామూలుగా అయితే ఈపాటికి టీడీపీ అధినేత చంద్రబాబు హడావుడి ఓ రేంజ్‌‌లో ఉండేది. నా వల్లే..కేజ్రీవాల్ విజయం సాధించాడని బాబు డప్పుకొట్టుకునేవారు..ఇక మా బాబు రాజకీయ చాణ్యకం, ఆర్థిక సహాయసహకారాల వల్లే.. కేజ్రీవాల్ గెలిచారని..ఇక మోదీకి ముందుంది ముసళ్ల పండుగ అని ఆయన అనుకుల మీడియా ఓ రేంజ్‌లో భజన …

Read More »

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల ఇజ్జత్ తీసిన వైసీపీ ఎమ్మెల్యే..!

విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లు చేస్తున్న విమర్శలపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. విశాఖపట్నం మద్దిలపాలెంలోని వైఎస్సార్‌సీపీ నగర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..ప్రపంచానికి కరోనా వైరస్ పడితే..ఏపీకి చంద్రబాబు వైరస్ వేధిస్తుందని సెటైర్ వేశారు. ఈ చంద్రన్న వైరస్‌కు ఆయన బతికున్నంత కాలం మందు దొరకదని ఎద్దేవా చేశారు. విశాఖలో భూకుంభకోణం జరిగిందంటూ టీడీపీ తమపై అనవసర రాద్ధాంతం చేస్తోందని …

Read More »