ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒకవైపు రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుంది బీరాలు పలుకుతుంటే మరోవైపు రాష్ట్రంలో ప్రజలు కనీస అవసరాలను కూడా తీర్చుకోలేక మృత్యు వాత పడుతున్నారు .
ఇటుక వేయకముందే ప్రపంచ స్థాయి రాజధాని కడతాను అని గొప్పలు చెప్పుకుంటున్న బాబు రాష్ట్రంలో ప్రభుత్వ దవఖానలో కనీస సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతున్నారు .ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఎనిమిది మంది సరైన వైద్యం అందక చనిపోయారు అని వార్తలు వస్తోన్నాయి .
ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 8మంది రోగులు రోజు వ్యవధిలో మృతిచెందారు. వీరంతా మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాములోపు మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.వీరందరి పరిస్థితి విషమించడంతోనే వారు మృతిచెందినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ జగన్నాథం తెలిపారు.ప్రధానంగా గుండె జబ్బు, వూపిరితిత్తుల సమస్య, రక్తహీనత, టీబీ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు మృతిచెందారని జగన్నాథం తెలిపారు