ఎస్ఎస్ రాజమౌళి అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఆయన సినిమా కెరీర్ లో ఇంతవరకు ఫ్లాప్ లు లేవు .తీసిన సినిమాలు అన్ని బ్లాక్ బ్లాస్టర్లే .టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న నటులు అంతా ఆయనతో కల్సి ఒక్క సినిమా అయిన చేయాలని ఆశపడుతుంటారు .తాజాగా ఆయన బాహుబలి సిరిస్ తో తెలుగు సినిమాను హిమాలయ శిఖరాల ఎత్తులో నిలబెట్టారు .
బాహుబలి బిగినింగ్ ,బాహుబలి ఎండ్ అంటూ రెండు పార్టులతో రీలీజ్ చేసి వెయ్యి కోట్ల వరకు వసూళ్లను కొల్లగొట్టారు అని సినీవర్గాలు అంటుంటారు .అట్లాంటి గ్రేట్ డైరెక్టర్ అయిన జక్కన్నకు ఝలక్ ఇచ్చింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ .ఒకప్పుడు తన అందచందాలతో కుర్రకారు మతిని పోగొట్టిన మిల్క్ బ్యూటీ తమన్నా .
తమన్నా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరిస్ లో నటించింది .అయితే బాహుబలి ఎండ్ మూవీ లో అమ్మడుకు ఎక్కువ పాత్ర ఉండదు .సెకండ్ పార్టులో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ .పాత్ర నిడివి పెంచాలని ఈ బ్యూటీ జక్కన్నను కోరింది అంట .తమన్నా కోరిన కోరికను జక్కన్న కాదు అన్నాడు అంట .దీంతో ఆమె ఇక నుండి జక్కన్న సినిమాల్లో నటించను అని తెగేసి చెప్పింది అమ్మడు .ఇప్పుడు ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది .అయితే ఈవార్తలు నిజమా లేదన్నది వీరిద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పితే కానీ అసలు ముచ్చట ఏమిటో అర్ధం కాదు ..?