ఎంతో కాలంగా ప్రభాస్ తో సినిమా చేయటం కోసం ఎదురుచూస్తున్న సుజిత్ దర్శకత్వంలో.. సాహో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ప్రభాస్ ప్రస్తుతం సాహో షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్, ఈ నెల 23న తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే టీజర్ ను రిలీజ్ చేసిన సాహో యూనిట్, ప్రభాస్ పుట్టిన రోజున మేకింగ్ వీడియోను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోందట. ప్రభాస్ సొంతం నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను 2018లో వేసవికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
