హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో నగరవాసులు నరకం చూసారు. అలాగే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయినవారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. మంచు లక్ష్మి కూడా హైటెక్స్ దగ్గర ఒక గంటన్నర ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిందట. దీనితో మంచు లక్ష్మీ ఆగ్రహంతో ఒక ట్వీట్ పెట్టారు. రాజకీయనాయకులు కూడా ప్రోటోకాల్ పక్కనబట్టి సాధారణ వ్యక్తులలాగా ప్రయాణిస్తే ట్రాఫిక్ కష్టాలు తెలుస్తాయి అనే అర్థం వచ్చేలా మంచు లక్ష్మి ట్వీట్ చేసారు.
మామూలుగా అయితే ఈ ట్వీట్ కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావాలి. రాజకీయనాయకులని ఎవరు తిట్టినా జనం మెచ్చుకుంటారు. అయితే మంచు లక్ష్మి ట్వీట్‌కి మాత్రం.. రస్నా అనే అమ్మాయి అనూహ్యమైన సమాధానం ఇచ్చింది. ఇంతకీ రస్నా ఇచ్చిన రిప్లై ఏంటంటే.. అవును.. తిరుమలలో మేము దర్శనానికి గంటలకి గంటలు క్యూలో నిల్చున్నప్పుడు మీరేమో విఐపి హోదాలో నేరుగా దర్శనానికి వెళ్తుంటే మాకు కూడా ఇలాగే అనిపిస్తుంది అని రిప్లై చేసింది. దీంతో రాస్నా ఇచ్చిన కౌంటర్‌కి మంచు షాక్ అవగా.., ఈ ట్వీట్ స్క్రీన్ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏది ఏమైన విఐపి కల్చర్ మీద ప్రజల్లో ఉన్న కోపమే ఈ ట్వీట్ ఇంతగా వైరల్ కావడానికి కారణం అయ్యిందరని సర్వత్రా చర్చించుకుంటున్నారు.