ఏపీ ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తోన్న లేటెస్ట్ మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ .ఈ మూవీ కి ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన నేత రాకేశ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు .
ఈ మూవీకు సంబంధించిన వివరాలను చర్చించడానికి అర్జీవీ నేడు రాకేశ్ రెడ్డి సొంత ఊరు అయిన పలమనేరులోని ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా అర్జీవీ మాట్లాడుతూ, చిత్రంలోని పాత్రలకు సంబంధించి ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదని ఆయన చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాకు కూడా ఇందులో అవకాశం ఉంటుందని..ఆమె ఒప్పుకుంటే తప్పకుండ అవకాశం ఇస్తామని అర్జీవీ తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, చిత్ర నిర్మాణానికి ఎన్ని కోట్లు ఖర్చైనా వెనుకాడబోమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు .ఈ మూవీకి సంబంధించి ఎవరి బెదిరింపులకు భయపడకుండా సినిమాను నిర్మిస్తామని ఆయన తెలిపారు.