తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లాలో కొండపాక మండలం దుద్దెడలో జిల్లా కార్యాలయ సముదాయం, పోలీస్‌కమిషనరేట్ నిర్మాణాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగసభలోముఖ్యమంత్రి మాట్లాడుతూ కేసీఆర్ కిట్ పథకం అమలు తర్వాత.. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని తెలిపారు.
జిల్లాలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తికావొచ్చాయని ఆయన వివరించారు. సిద్దిపేటకు మరో వెయ్యి ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. సిద్దిపేటకు ప్రత్యేక పోలీస్ బెటాలియన్ కేటాయిస్తామని వెల్లడించారు. త్వరలో రంగనాయక్ సాగర్‌కు గోదావరి నీళ్లు వస్తాయన్నారాయన. రైతులు సంఘటితమయితే గిట్టుబాటు ధరలు వస్తాయి రైతులను సంఘటితపరిచే కార్యక్రమాన్ని ప్రభుత్వమే చేపట్టిందని ఆయన తెలిపారు.
వచ్చే సంవత్సరం నుంచి ఎకరానికి 8వేలు ఇస్తామని ఆయన చెప్పారు. ప్రాజెక్టులపై విపక్షాలు కోర్టులకు వెళ్తూ చిల్లరరాజకీయాలు చేస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. రూ.5 వేల కోట్లతో 84 లక్షల గొర్రెలు పంపిణీ చేశామన్నారు.