ఏపీ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .గత మూడున్నర ఏండ్లుగా అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హమీను కూడా నేరవేర్చకపోవడమే కాకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకొని సాగిస్తున్న అవినీతి అక్రమ పాలనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ శ్రేణులు కొనసాగిస్తున్న పోరాటాలు ..
ఉద్యమాలకు ఆకర్షితులై వైసీపీ పార్టీలో చేరుతున్నారు .ఈ క్రమంలో రాష్ట్రంలో వైజాగ్ జిల్లాలో అనకాపల్లి టౌన్ కి చెందిన పీసీసీ కార్యదర్శి, తుమ్మపాల షుగర్స్ మాజీ చైర్మన్ దంతులూరి దిలీప్‌కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు .దీనికి సంబంధించిన లేఖను ఆ పార్టీ నాయకత్వానికి పంపినట్లు ఆయన వెల్లడించారు .ఈ రోజు గురువారం తన అనుచరవర్గం తో సహా వైసీపీ పార్టీలో చేరడానికి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం లోటస్ పాండ్ కు బయలుదేరారు .దీలీప్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు .