నాగార్జున , సమంత , సీరత్ కపూర్ జంటగా.. ఆట ఫేం ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాజుగారి గది-2. ఇక నాగార్జున చైతు – సమంత పెళ్లి హడావిడి లో ఉండడం తో సినిమా ప్రమోషన్స్ లలో పాల్గొనలేకపోయాడు. దీంతో ఈరోజు చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పటు చేసి చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేసారు.
ఈ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ.. డైరక్టర్ ఓంకార్ కు ఓసిడి వుందని, తన పెర్ ఫెక్షన్ తో మొత్తం అందరినీ చంపేసాడని, దాదాపు దెయ్యాలు అయిపోయాం అని నాగార్జున తెలిపి నవ్వులు పోయించాడు. ఆ బాధ పడలేక, చివరికి, షూటింగ్ ఆఖరి రోజు ఓంకార్ కు దండం పెట్టేసానని తెలిపాడు. సమంత తన ఇంటికి కోడలిగా వచ్చి వారం రోజులే అయిందని, అందువల్ల ఈ సినిమా హిట్ అయితే, కోడలు వచ్చి హిట్ తెచ్చిందని చెప్పుకుంటా అని నాగ్ తెలిపాడు. అంతే కాదని, తాను సమంతకు పెద్ద అభిమానిని అని, ఏమాయ చేసావె సినిమా టైమ్ లో ఫొన్ చేసి అదే చెప్పానని నాగ్ గుర్తు చేసుకున్నారు. పెళ్లి తరువాత తొలిసారి మీడియ ముందుకు వచ్చింది హీరోయిన్ సమంత.