తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మెట్రో రైలు ట్రయల్ రన్ మూడో రోజు విజయవంతంగా కొనసాగుతుంది.ఈ క్రమంలో సికింద్రాబాద్ పరిధిలోని మెట్టుగూడ – బేగంపేట మధ్య మెట్రో రైలు పరుగులు పెడుతుంది. మొత్తం 15 నుంచి 20 రోజుల్లో పూర్తి స్థాయి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్ 28న మెట్రో రైలును ప్రారంభించనున్నట్లు సమాచారం. మెట్రో రైలుకు పచ్చజెండా ఊపేందుకు ప్రధాని మోదీ సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ.. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
