ఏపీ పిలో కొన్ని జిల్లాలలో డెంగ్యూ వ్యాది విస్తరిస్తున్న తీరుపై ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది . ఒక్క శుక్రవారం రోజే మూడు జిల్లాలలో పదిహేను మంది డెంగ్యూవిషజ్వరాలతో చనిపోయారని ఆ పత్రిక తెలిపింది.
ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పది మంది మరణించగా, ప్రకాశం ,గుంటూరు జిల్లాలోని పల్నాడులలో కూడా మరణాలు సంభవించాయని ఆ కథనం వివరించింది.నెల్లూరు జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఈ వ్యాది వ్యాపించిందని చెబుతున్నారు.
అయితే నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ మాత్రం 175 కసులు అడ్మిట్ అయినా మరణాలు లేవని అన్నారు. కాని నెల్లూరులో డెంగీ , నీటి కి సంబందించిన వ్యాధుల కారణంగా మరణాలు జరిగాయని ఆ పత్రిక వివరిస్తోంది.