తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఆర్పీ సంజీవ్ గోయంక గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకున్నది. సంజీవ్ గోయంక గ్రూపు.. మెదక్ జిల్లాలోని తూప్రాన్‌లో.. ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్ సెంటర్‌ను ప్రారంభించనున్నది. సుమారు రూ.200 కోట్లతో ఆ వ్యాపారకేంద్రాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఈ అంశంపై సంజీవ్ గోయంకతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే వ్యాపార సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు.. ప్రభుత్వ విధానాలను.. ఈసందర్భంగా సంజీవ్ గోయంకతో కేటీఆర్ చర్చించారు. ఆర్పీఎస్పీ గ్రూపు ద్వారా స్థానిక రైతులు బలోపేతం కానున్నట్లు మంత్రి తెలిపారు.
