Home / SLIDER / తెలంగాణ కాంగ్రెస్ నేతలపై డిప్యూటీ సీఎం కడియం నిప్పులు..

తెలంగాణ కాంగ్రెస్ నేతలపై డిప్యూటీ సీఎం కడియం నిప్పులు..

వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు ఈ నెల్ 22న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేసే ఉద్దేశ్యంతో వరంగల్ అర్బన్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజక వర్గ స్థాయి నేతలు, కార్యకర్తల సమావేశానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి. సమావేశంలో పాల్గొన్న ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ నన్నపనేని నరేందర్, కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ రాజయ్య యాదవ్, నియోజకవర్గ ఇంచార్జి బాండ ప్రకాష్, స్థానిక నేతలు.కాకాతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ద్వారా వచ్చే 5 ఏళ్లలో 1, 20,000 ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.సీఎం కేసీఆర్ ఏదైనా గొప్పగా, పెద్దగా ఆలోచిస్తారు. వరంగల్ లో టెక్స్టై టైల్ పార్క్ కావాలని మేము అడిగితే ఆసియా లొనే అతి పెద్దదైన మెగా టెక్స్ టైల్ పార్క్ ఇచ్చారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో లభించే ప్రత్యేకతలు, విశిష్ఠలు ఉన్న బట్టలన్నీ మన దగ్గర దొరికే విధంగా ఈ పార్క్ ఉంటుంది.

టెక్స్ టైల్ పార్క్ కు శంకు స్థాపన రోజే 669 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ఔటర్ రింగ్ రోడ్డుకు, 72 కోట్ల వ్యయంతో నిర్మించే కాజీపేట-హన్మకొండ ఆర్వోబి, వరంగల్ లో ఐటీ పార్క్ కు విస్తరించే కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.-2014 తర్వాత వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పెద్ద ఎత్తున నిధులు తెస్తున్నారు. వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పోరేషన్ కు బడ్జెట్ లో 300 కోట్ల రూపాయలు పెట్టారు. గతంలో కాంగ్రెస్ నేతలు ఎప్పుడైనా ఇది ఆలోచించారా?ఎన్నడూ తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచించని కాంగ్రెస్ సన్నాసులు.. సీఎం కేసీఆర్ అభివృద్ది చేస్తుంటే అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేస్తూ స్టేలు తేవడం కంటే మరొక దుర్మార్గం లేదు.రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నపుడు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసి వేలాది కోట్ల రూపాయలు నిస్సిగ్గుగా దోచుకున్నారు. ఈ దోపిడీ ఫలితంగానే ఆయన కొడుకు జగన్ నేడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు.

ఈ వరంగల్ జిల్లాకు చెందిన ఒక పెద్దాయన మంత్రిగా ఉంటూ రాజశేఖర్ రెడ్డి దోపిడీకి బ్రోకర్ గా వ్యవహరించి, జిల్లాకు అపఖ్యాతి మూటగట్టారు.ఇట్లాంటి కాంగ్రెస్ నేతలు చరిత్ర మరిచి నేడు మాట్లాడుతున్నారు. గతంలో ఇసుక దందా, బ్యాంకుల దోపిడీ యూనివర్సిటీ భూముల కబ్జా, సెటిల్మెంట్లు చేసిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ ది.అవినీతి, అక్రమాలకు పేటెంట్ కాంగ్రెస్ ది. జిల్లా అభివృద్ధి కోసం ఏనాడైనా ఈ కాంగ్రెస్ నేతలు ఆలోచించారా?తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ గా, ఐటీ హబ్ గా అభివృద్ధి చేస్తున్నారు.ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం, మల్కాపూర్ రిజర్వాయర్ ద్వారా జిల్లాలోని ప్రతి ఎకరం భూమిని సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి రక్షిత మంచి నీరు అందిస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు గాని, పథకాలు గానీ కాంగ్రెస్ బుర్రలకు తట్టాయా అని అడుగుతున్నా అన్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat