లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ ఏ ముహుర్తాన ప్రకటించాడో గానీ.. టీడీపీ నేతలు మాత్రం పంచలు తడుపుకుంటున్నారు. ఇక టీడీపీ నేతలు ఒక్కొకరుగా వర్మ పై అటాక్ చేస్తుంటే.. రాము మాత్రం సింగిల్ హ్యాండ్‌తో టీడీపీ బ్యాచ్‌కి తనదైన శైలిలో పంచ్‌లు ఇచ్చుకుంటూ పోతున్నారు. టీడీడీ నేతల నుండి ప్రతి కామెంట్‌కీ సోషల్ మీడియా నుంచి కౌంటర్ ఇస్తున్న వర్మ తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వోడ్కా రుచి చూపించారు. తాజాగా చంద్రబాబు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై టీడీపీ నాయకుల్ని అతిగా స్పందించవద్దని చెబుతూ.. ఎన్టీఆర్ జీవితం తెరచిన పుస్తకం అని ఆయన జీవితాన్ని వక్రీకరించి సినిమా తీస్తే ప్రజలు హర్షించరని బాబు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే చంద్రబాబు కామెంట్స్‌కి స్పందించిన వర్మ.. చంద్రబాబు నాయుడు గారి మాటలు ముమ్మాటికీ నిజం.. అందుకనే నేను నిజంగా జరిగిన నిజాలనే ఏ మాత్రం వక్రీకరించకుండా తీయబోతున్నాను. చంద్రబాబు గారు అన్నట్టు ఎన్టీఆర్ జీవితం తెరచిన పుస్తకమే.. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో నేనే ఆ పుస్తకం లోని చిరిగిపోయిన లేదా చింపబడ్డ చాలా పేజీలను తిరిగి అతికించబోతున్నానని క్లారిటీ ఇచ్చాడు. ఆ చించివేయబడ్డ పేజీలను వెన్నుపోటు, ఎన్టీఆర్‌పై చెప్పులేయించడం.. వంటి విషయాలుగా జనం అర్థం చేసుకోవాలేమో. ఎందుకంటే, వెన్నుపోటుకి అధికార మార్పిడి అనే ఘనమైన పేరు పెట్టి, చరిత్రను వక్రీకరించింది ఇంకెవరో కాదు, చంద్రబాబే. పిల్లనిచ్చిన మామ, రాజకీయంగా గుర్తింపునిచ్చిన మామ ఎన్టీఆర్‌పై చెప్పులేయించిన ఘన చరిత్ర కూడా చంద్రబాబుదే మరి. చరిత్రను వక్రీకరించకుండా వున్నది వున్నట్లుగానే తీస్తున్నా..’ అంటూ వర్మ, చంద్రబాబుకి ఇచ్చిన ‘పవర్ పంచ్’పై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.