Home / Tag Archives: chandhrababu

Tag Archives: chandhrababu

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎవరో తెలుసా..?

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు పేరును ప్రకటించనున్నట్టు సమాచారం. పార్టీ అధినేత చంద్రబాబు నేడు లేదా రేపు TTDP అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించనున్నారు. సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్ష పదవిపై అనాసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. వచ్చింది.

Read More »

TTD చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి

ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియమితులయ్యారు. టీటీడీ చైర్మన్ గా ఆయన్ను కొనసాగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే, టీటీడీ ఛైర్మన్ గా తిరిగి కొనసాగేందుకు ఆయన సుముఖంగా లేరని గతంలో ప్రచారం జరిగింది. ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకంగా మారాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, సీఎం ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని గతంలో సుబ్బారెడ్డి తెలిపారు.

Read More »

నిరుద్యోగులకు అండగా నారా లోకేష్

ఏపీ ఉద్యోగ పోరాట సమితి ఈ నెల 19న తలపెట్టిన ‘చలో తాడేపల్లి’ కార్యక్రమానికి పోలీసులు అనుమతివ్వకపోవడంపై TDP నేత నారా లోకేశ్ స్పందించారు. నిరుద్యోగులను పోలీసులు బెదిరిస్తున్నారు.. కేసులు పెట్టి భవిష్యత్తు దెబ్బతీస్తామని హెచ్చరించడం జగన్ అరాచక పాలనకు నిదర్శనమన్నారు. కొందరు పోలీసులు YCP బానిసల్లా బతుకుతున్నారని.. రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును కాలరాసే హక్కు పోలీసులకు లేదన్నారు.

Read More »

బాబుకు షాక్ -టీడీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

ఏపీ తెలుగుదేశం పార్టీకి చెందిన  మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు.! ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీకి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బై బై చెప్పేసి వైసీపీకి మద్దతివ్వడం.. వారి కుటుంబ సభ్యులకు కండువాలు కప్పించేశారు. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, ద్వితియ శ్రేణి నేతలు వైసీపీ కండువాలు కప్పేసుకున్నారు. అయితే తాజాగా.. విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా …

Read More »

ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకి గుండెపోటు

ఆంధ్రప్రదేశ్ టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. చంద్రబాబుతో కృష్ణా జిల్లా పర్యటనలో పాల్గొన్న ఆయన.. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను విజయవాడ రమేశ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు.. యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం అర్జునుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Read More »

టీడీపీకి ఎల్ రమణ రాజీనామా

తెలంగాణ టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎల్ ర‌మ‌ణ గురువారం ఉద‌యం రాజీనామా చేశారు. త‌న రాజీనామా లేఖ‌ను చంద్ర‌బాబుకు ర‌మ‌ణ పంపారు. తెలంగాణ‌లో మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌గా, రాష్ర్ట ప్ర‌గ‌తిలో భాగ‌స్వామ్యం కావాల‌నే భావ‌న‌తో టీఆర్ఎస్ పార్టీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నాను అని ర‌మ‌ణ తెలిపారు. ఈ క్ర‌మంలో తెలంగాణ టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నాను. గ‌త 30 సంవ‌త్స‌రాలుగా త‌న ఎదుగుద‌ల‌కు తోడ్పాటునందించిన …

Read More »

కారు ఎక్కనున్న ఎల్ రమణ

తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. రమణకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నట్టు మరో ప్రచారం. ఎల్.రమణతో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు,జగిత్యాల MLA డాక్టర్ సంజయ్ సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఎల్‌.రమణ ఉమ్మడి ఏపీలో చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి టీటీడీపీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఎల్.రమణతో పాటు పలువురు టీడీపీ నాయకులు టీఆర్ఎస్‌లో చేరనున్నట్టు సమాచారం …

Read More »

మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట్లో మరో విషాదం

ఏపీకి చెందిన మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన రెండో కుమారుడు రవీంద్ర నాథ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హైదరాబాద్-బంజారాహిల్స్ రోడ్ నం.2లోని హయత్ ప్లాజాలో చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. రవీంద్రనాథ్ను అపోలోకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతికి కారణాలు తెలియలేదు. కాగా ఇటీవలే మాగంటి పెద్ద కుమారుడు రాంజీ అనారోగ్యంతో మృతి చెందారు.

Read More »

తీవ్ర అస్వస్థతకు గురైన తమ్మినేని సీతారాం

ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత రెండు రోజులుగా స్పీకర్ జ్వరంతో బాధపడుతున్నారు. ఇటీవలే స్పీకర్ దంపతులకు కరోనా సోకడంతో చికిత్స పొంది కోలుకున్న విషయం తెలిసిందే.

Read More »

ఓ దృఢ సంకల్పం ఘన విజయం సాధించి నేటికి రెండేళ్లు

రాజకీయ కుట్రలకు ఎదురు నిలిచిన ఆ గుండె ఘన విజయం సాధించి రెండేళ్లు. ఆ గుండె చప్పుడుకు ప్రత్యర్ధి కోటలు బద్దలై ఇప్పటికీ కోలుకోలేదు. ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి ఉన్న నాయకుడు పాలనా పగ్గాలు చేపడితే ప్రభుత్వ పథకాలు ఎలా ఉంటాయో ఈ రెండేళ్లలో చూశాం. పారదర్శకతతో కూడిన పాలన ఎలా ఉంటుందో చూస్తున్నాం. ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డికి ఇంట్లో కూర్చుంటే రాలేదు. …

Read More »