బాలీవుడ్ ప్రముఖ సినీ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్. ఎప్పుడూ ఏదో ఒక వివాదం క్రియేట్ చేయడం.. ఎవరో ఒకరి పై విమర్శలు చేయడం, వార్తలు.. వార్తల్లోకి ఎక్కడం ఇతని డైలీ హాబీ. అయితే ఇప్పుడు తాజాగా కమల్‌కు ట్విట్టర్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇండియాలో సినిమాలు విడుదలకు ముందే దుబయ్‌లో ప్రీమియర్ షో చూసేసి, వెకిలి రివ్యూలు రాసే కే ఆర్ కే అకౌంట్‌ను ట్విట్టర్ నిలిపేసింది.
సాధారణంగా ట్వీట్లలో అసభ్య పదజాలాన్ని, మతాలను, భావజాలాలను కించపరిచే పదజాలం ఉన్నపుడు ట్విట్టర్ ఇలా ఖాతాలను నిలిపివేస్తుంది. అంతేకాకుండా వినియోగదారుల ట్వీట్లను ఎక్కువ మంది రిపోర్ట్ చేసినపుడు కూడా ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేస్తుంది. మరి, కమల్ ఏ విషయంలో బ్లాక్ అయ్యాడో తెలియాల్సిఉంది.