క్రికెట్‌ను మతంలా భావించే భారత్‌కు ప్రపంచ కప్‌ను మొదట లెజెండ్ ఆల్‌రౌండర్ మాజీ కెప్టన్ కపిల్ దేవ్ అందిచారు. ఇక 28 ఏళ్ల తర్వాత 2011లో వన్డే ప్రపంచకప్‌ని అందించిన మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని తర్వాత ఏడాదే నాయకత్వ బాధ్యతల నుంచి పక్కకి తప్పించాలని సెలక్టర్లు నిర్ణయించారట. ఈ విషయాన్ని ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ తాజాగా డెమోక్రసీస్ ఎలెవన్ : ద గ్రేట్ ఇండియన్ క్రికెట్ స్టోరీ పుస్తకం ద్వారా వెల్లడించారు.
అయితే.. ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసన్ ఈ నిర్ణయాన్ని తిరస్కరించడంతో సెలక్టర్లు వెనక్కి తగ్గారట. 2014, డిసెంబరులో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. ఈ ఏడాది జనవరిలో టీ20, వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకి తప్పుకున్న విషయం తెలిసిందే. ధోనీ సారథ్యంలో అద్భుతంగా ఆడిన భారత్ జట్టు 2011లో ప్రపంచకప్ గెలిచింది. ఆ తర్వాత ఏడాదే అతడిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని మొహిందర్ అమరనాథ్ అధ్యక్షుడిగా ఉన్న సెలక్షన్ కమిటీ నిర్ణయించింది.
ఇక అప్పటి బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో నేను ఆ నిర్ణయాన్ని తిరస్కరించారట శీనివాసన్. అలా చేయడం పక్షపాతం అని మీరు అనుకోవచ్చు. కానీ.. 2007లో టీ20 ప్రపంచకప్, 28 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌ని భారత్‌కి అందించిన గొప్ప కెప్టెన్‌కి నేనిచ్చిన గౌరవం అదేనని నా నమ్మకం’ అని శ్రీనివాసన్ ఆ పుస్తకంలో తన అభిప్రాయన్ని స్పష్టం చేశారు. 2013లో తనపై ఫిక్సింగ్ ఆరోపణలు రావడంపై ధోనీ కూడా ఈ పుస్తకం ద్వారా స్పందించాడు. ఒకవేళ నేను బాగా ఆడకపోతే విమర్శించండి.. తప్పులేదు. కానీ.. ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు ఆరోపించకండి. క్రికెట్ వల్లే నేను ఈ స్థాయికి ఎదిగాను. అప్పట్లో నాపై ఆరోపణలు మీడియాలో మరీ బాధించేలా వచ్చాయి అని ధోనీ వెల్లడించాడు.