బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నిత్యం వివాదాలతో వార్తల్లోకెక్కుతుంది. ఇక తన ఫై ఎన్ని వార్తలు వచ్చినా, ఎన్ని విమర్శలు తెరపైకి వచ్చినా.. వాటినేవి పట్టించుకోకుండా తనపనేదో తాను చేసుకుంటూ వెళ్ళేతుంది. ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం లో మణికర్ణిక.. ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ మూవీలో నటిస్తోంది.
ప్రస్తుతం ఈ మూవీ సగం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. అయితే చిత్ర యూనిట్ ఈ మూవీ లోని కంగనా కు సంబదించిన పిక్స్ ఏవి విడుదల చేయకుండా చాలజాగ్రత్త పడుతూ వస్తోంది. అయితే ఈ పిక్స్ సోషల్ మీడియా లో లీక్ కావడం పట్ల చిత్ర యూనిట్ షాక్ లో పడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ సినిమాలో కంగన పాత్రకు తగ్గట్టుగా చాలా సింపుల్గా ఉన్నట్లు ఈ పిక్స్ చూస్తే అర్ధం అవుతుంది. జైపూర్ లో వేసిన ఒక సెట్లో డైలాగ్స్ చెబుతూ కనిపించింది. అలాగే దర్శకుడు క్రిష్ కూడా ఆమెకు సహాయం చేస్తున్నట్లు ఆ ఫొటోలో కనిపిస్తోంది. ఇంతకీ ఈ పిక్స్ ఎవరు లీక్ చేసారు అనే కోణం లో చర్చలు జరుపుతున్నారు. ఈ సినిమా షూటింగ్ మరో మూడు నెలల్లో క్రిష్ పూర్తి చేస్తాడట. ఎలాగైనా సమ్మర్ మొదట్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని చిత్ర నిర్మాతలు చూస్తున్నారు.