ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రస్తుత రోజుల్లో ఎక్కడ ఏమి జరిగిన కానీ ఆ అంశంపై స్పందించే వర్మ ..టీడీపీ పార్టీకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్‌ని బాహుబలితో పోలుస్తూ మార్ఫింగ్ ఫోటోలని కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇక తాజాగా మెగాస్టార్ రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నెం 150 లో చిరు స్టిల్స్‌కి సంబంధించి కొన్నింటిని మార్ఫింగ్ చేసి తన ఫేస్ బుక్ పేజ్‌లో పోస్ట్ చేశాడు. రియల్ మెగాస్టార్ ఆఫ్ కాంగ్రెస్ అంటూ వర్మ పోస్ట్ చేసిన ఈ ఫోటోలపై మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు.
రేవంత్‌పై తనకున్న అభిమానం వేరేలా ప్రదర్శించుకోవాలే తప్ప, మా అభిమాన హీరో పోస్టర్స్ వాడుకోవడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు అంటూ ఆర్జీవి పోస్ట్ చేసిన ఫోటోలపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.