ప్రముఖ సోషల్ మీడియాదిగ్గజం వాట్సాప్ సేవలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడటంతో సోషల్‌మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ‍్యంగా ట్విట్టర్లో ఫిర్యాదుల వెల్లువ కురిసింది. అంతేకాదు…కొంతమంది యూజర్లు తమదైన శైలిలో స్పందిస్తూ.. వీడియోలను పోస్ట్ చేశారు.
చిన్నా పెద్దా తేడలేకుండా..నిత్య జీవితంలో ముఖ‍్య భాగంగా మారిపోయిన వాట్సాప్‌లో సందేశాలు నిలిచిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుపుతూ ఈ వీడియోలు పోస్ట్ చేశారు. హిల్లేరియస్‌గా ఉంటూనే.. ఆలోచింప చేస్తున్నాయి. ప్రపంచం అంతా తల్లికిందులు అయిపోతున్నట్టు ఫీల్ అయ్యారు. అంతేగాక ప్రాణం పోయినంత పని అయ్యింది. అసలు ఎందుకు ప్రపంచవ్యాప్తంగా గంట సేపు ….వాట్సాప్ సేవలు ఎందుకు ఆగినాయి అనుకున్నారు అప్ డేట్ కోసం అని సమచారం.