ఏపీ ప్రజల కోసం వైసీపీ అధినే జగన్ మోమన్ రెడ్డి నవంబర్ 6న అంటే సోమవారం ప్రజాసంకల్ప యాత్ర గ్రాండ్‌గా ప్రారంభిచారు. మొదట వైఎస్‌ఆర్ ఘాట్‌ను సందర్శించిన జగన్.. కుటుంబసభ్యులతో కలిసి.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జనసంద్రమైన ఇడుపులపాయ నుంచి ప్రజలతో మమేకమై.. పార్టీ నేతలు వెంటరాగా తొలి అడుగులు వేశారు.
ఇక ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో జగన్ అదరిపోయే ప్రసంగం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై జగన్ మాటల తూటాలు పేల్చారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు అవుతోందని.. ఈ నాలుగేళ్ళలో ఆయన పాలన గ్రామస్థాయి నుండి రాజధాని వరకు చేయని అక్రమాలు అరాచకాలు లేవని జగన్ ద్వజమెత్తారు.
ఇక చంద్రబాబు పాలనలో రైతులు, అక్కాచెల్లెమ్మలు మోసపోయారని, విద్యార్థులు, నిరుద్యోగులు దగాపడ్డారని, అందుకే రైతుల నుంచి అక్కాచెల్లెమ్మల వరకు అందరిలోనూ “చంద్రబాబు అంతటి మోసగాడు దేశ చరిత్రలోనే ఉండడు” అనే మాట వినిపిస్తోందని.. జగన్ మాటల తూటాలు పేల్చారు. చంద్రబాబు పాలనలో రైతులు, చేనేతలు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని చెప్పారు.
రాష్ట్రంలోని ఏ ఒక్క కుటుంబం కూడా సంతోషంగా లేదని, ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరికీ భరోసా ఇచ్చేందుకు తాను పాదయాత్ర చేపడుతున్నట్టు వైఎస్ జగన్ అన్నారు. నా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు ఎంతటి దూరాన్నైనా లెక్కచేయకుండా వచ్చిన తాతలకు, అవ్వలకు, అన్నాదమ్ములు, అక్కాచెళ్లెళ్ళు. అందరకీ చేతులు జోడించి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెల్పారు.