# ఈనాడు..సాక్షి కలిస్తే..?
బద్ధశత్రువులుగా వ్యవహరించిన ఈనాడు అధినేత రామోజీ రావు, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భేటీ కావడం ఏపీ రాజకీయాలను మలుపు తిప్పబోతున్నాయనే చర్చలు మొదలయ్యాయి. గతంలో టీడీపీకి రామోజీ రాజగురువు పాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే.. ఈనాడు గ్రూపు, సాక్షి గ్రూపుల నడుమ అక్షరాలా ఓ యుద్ధమే సాగింది.
అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఈనాడు-సాక్షి భాయి భాయి అయ్యాయనే సంఖేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల నటుడు మోహన్‌బాబు ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో రామోజీరావు, జగన్ కలిసి మాట్లాడుకుంటున్న ఫొటోలు ఆసక్తిని రేకెత్తించాయి. తరువాత రెండు గ్రూపుల ముఖ్యుల నడుమ సంబంధాలు బాగా మెరుగుపడినట్టు చెబుతున్నారు. జగన్, రామోజీ కుటుంబసభ్యుల నడుమ కూడా కొంతకాలంగా వైరభావన తగ్గి, స్నేహపూర్వక వాతావరణం ఏర్పడినట్లు సమాచారం.
అంతే కాకుండా ఏపీలో చంద్రబాబు నాయుడు విఫల పాలన నేపథ్యంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా రామోజీ జగన్‌కు స్నేహహస్తం అందించినట్లు తెలుస్తోంది. ఏపీలో వచ్చే ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడం ఖాయమని రామోజీ ఓ అభిప్రాయానికి వచ్చేశారని తెలుస్తోంది. ఇక మరోవైపు జగన్ చేపట్టిన పాదయత్రకు ముందు రామోజీను కలవడంతో రాజకీయ వర్గాల్లో హట్ టాపిక్ అయ్యింది. అయితే పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో ఇచ్చిన స్పీచ్‌లో చంద్రబాబును ఆడేసుకున్నారు.
ఇక జగన్ పాదయాత్ర మొదటిరోజు సజావుగానే ముగిసింది.. అయితే మంగళవారం ఈనాడు మెయిన్ ఎడిషన్‌లో చంద్రబాబుకు వ్యతిరేకంగా వచ్చిన సంచలన కథనం చూసి రాజకీయ వర్గాలన్నీ ఆశ్చర్యపోయారు. దీంతో ఇప్పటికే సోషల్ మీడియాలో ఈనాడు- సాక్షీలు కలిసిపోయాయని రకరకాలుగా చర్చలు మొదలయ్యాయి. దీంతో నిజంగానే ఈనాడు-సాక్షీలు కలిసిపోయాయా.. ఒకవేళ అవి రెండు ప్రముఖ మీడియా గ్రూపులు కలిస్తే ఏపీ రాజకీయాలలో వచ్చే మార్పులు ఏంటి.. ఆ ప్రభావం చంద్రబాబు సర్కార్ పై ఎలా ఉంటుందో అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.