ఒక మహిళా హోమ్ గార్డుతో మసాజ్ చేయించుకుంటున్న ఏఎస్సై వీడియో ఒకటి ఇప్పుడు అన్ని ప్రముఖ ఛానల్ లో చక్కర్లు కొడుతుంది .అసలు విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల్ లో సాయుధ రిజర్వ్ ఏఎస్ఐ గా పని చేస్తున్న హసన్ అనే అధికారి మహిళా హోమ్ గార్డుతో మసాజ్ చేయించుకుంటూ మీడియాకు అడ్డంగా దొరికారు .ఇందుకు సంబంధించిన ఒక వీడియో వెలుగులోకి రావడంతో జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ విచారణకు ఆదేశించారు .
