సినీ నటుడు రాజశేఖర్ నటించిన తాజా చిత్రం గరుడవేగ సంచలన విజయం దిశగా దూసుకుపోతుంది. పుష్కరకాలం తర్వాత హిట్ కొట్టన యాంగ్రి యంగ్‌మాన్ వరుస పెట్టి చానళ్ళకు ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. అయితే తాజగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజశేఖర్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
అసలు విషయం ఏంటంటే.. రాజశేఖర్ రియల్ లైఫ్‌లో ఎఫైర్లు ఎక్కువట. పెళ్లికి ముందునుండే ఎఫైర్లు మొదలెట్టిన రాజశేఖర్ జీవితను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా చాలా మందితో ఎఫైర్లు కొనసాగించాడట. అయితే అవన్నీ అనుకోకుండా జరిగాయట. అనుకోకుండా జరిగినా.. అనుకొని జరిగినా.. తనకి ఎఫైర్స్ ఉన్నాయని ఒప్పుకోవడంతో సినీ వర్గీయుల్లో హాట్ టాపిక్ అయ్యింది.