అక్కినేని కోడలు సమంతకి సినీ అభిమానులతో పాటు.. సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ ఎక్కువ. సమంత ఏ పని చేసినా అది సోషల్ మీడియాకి ఎక్కాల్సిందే. లేకపోతే సమంత నిద్రే పోదు. ఇక సంమంత ఎంగేజ్ మెంట్ అయినప్పటి నుండి సమంతకు సంబందించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక గతంలో సమంత ఎంగేజ్ మెంట్లో కట్టుకున్న చీర సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు తాజాగా జరిగిన అక్కినేని వారి రిసెప్షన్లో సమంత డ్రస్ రేటు గురించి మరోసారి హాట్ టాపిక్ నడుస్తోంది. రిసెప్షన్లో నాగ చైతన్య స్పెషల్ సూటుతో రాగా.. సమంత మాత్రం ట్రెండీ గౌనుతో దర్శనమిచ్చి అందరి చూపు తన వైపు తిప్పుకుందట.
దీంతో మరోసారి సమంత గౌను పై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. మొదట గౌను డిజైన్ గురించి చర్చించుకున్న నెటిజన్లు.. ఆ తర్వాత ఆ గౌను రేటు గురించి చర్చలు మొదలయ్యాయి. న్యాచురల్‌గానే సంమంతకి కొంత ఫ్యాషన్ పిచ్చి ఉంది. మరి రిసెప్షన్‌కి సాదా సీదా గౌను వేసుకొని ఎందుకు వస్తోంది.. ఆమె ధరించిన గౌను ఖరీదు అక్షరాలా 15 లక్షలు ఖర్చు పెట్టి స్పెషల్ డిజైనింగ్‌తో కుట్టించారని సమాచారం. దీంతో మరోసారి సమంత డ్రెస్ పై సోషల్ మీడియాలో వైరల్ టాపిక్ నడుస్తోంది.