మూవీ : స్నేహమేరా జీవితం
నటీనటులు: శివ బాలాజీ,రాజీవ్ కనకాల,సుష్మ యార్లగడ్డ, చలపతిరావు, సత్య..
సంగీతం: సునీల్ కశ్యప్
ఎడిటింగ్: మహేంద్రనాథ్
కళ: రామ కుమార్
ఛాయాగ్రహణం: భరణి కె ధరణ్
నిర్మాత: శివ బాలాజీ
రచన, దర్శకత్వం: మహేష్ ఉప్పుటూరి
సంస్థ: గగన్ మేజికల్ ఫ్రేమ్స్
విడుదల తేదీ: 17-11-2017
టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా చిన్న సినిమాలు తమ సత్తాను చాటుతున్నాయి .స్టొరీ ,స్టొరీ తీసే విధానం బాగుంటే చాలు తెలుగు సినిమా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు .ఈ క్రమంలో నేడు శుక్రవారం వచ్చిన మరో చిన్న చిత్రం స్నేహమేరా జీవితం -1982 .మొదట హీరోగా నటించి ఆ తర్వాత ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు శివబాలాజీ .ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న బాలాజీ నటించిన లేటెస్ట్ మూవీ తనకు ఏ మేర బూస్ట్ ఇచ్చింది .మరోవైపు సీనియర్ నటుడు రాజీవ్ కనకాల ఏ విధంగా ఆకట్టుకున్నారో చూద్దాం ..?
అసలు కథ ఏమిటి : మోహన్ పాత్రలో నటించిన శివ బాలాజీ, చలపతి పాత్రలో నటించిన రాజీవ్ కనకాల మంచి స్నేహితులు. బాల్యం నుండి కలిసి పెరిగారు. వీరిద్దరిలో చలపతికి ఎమ్మెల్యే కావాలని చిరకాల కోరిక.అందుకోసమే ప్రతి పైసాను కూడబెట్టుకుంటాడు . ఈ నేపథ్యంలో మోహన్ ఇందిర(సుష్మ)ని ప్రేమిస్తుంటాడు. ఏడాది పాటు ఆమె వెనకే తిరుగుతాడు. ఏడాది గడిచిన కానీ ‘ఐ లవ్‌వ్యూ’ అని చెప్పలేడు. ఇందిరను ప్రేమిస్తున్న విషయం చలపతికి తెలుస్తుంది. స్నేహితుడికి సాయం చేద్దామనుకుంటాడు చలపతి. అయితే అనుకోకుండా చలపతి, ఇందిర చాలా సన్నిహితంగా ఉండటాన్ని గమనిస్తాడు మోహన్. తాను ప్రేమించిన అమ్మాయిని స్నేహితుడు లోబరుచుకుంటున్నాడు అని భ్రమపడి భరించలేక ఆ ఊరి నుంచి వెళ్లిపోతాడు. అక్కడ ఒక ప్రేమ జంటను కాపాడబోయి చిక్కుల్లో పడతాడు. మోహన్ ఈ సమస్యను నుంచి ఎలా బయటపడ్డాడు? తన స్నేహితుడిని ఎలా కలుసుకున్నాడు? చివరికి తాను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకున్నాడా? అనేదే ఈ మూవీ కథ సారాంశం .
ఎలా ఉందంటే:
సరిగ్గా ముప్పై ఐదేండ్ల కింద అంటే 1982 నేపథ్యంలో సాగిన కథ ఇది .అయితే అప్పటి నేపథ్యాన్ని ఈ మూవీ దర్శకుడు ఎందుకు ఎంచుకొన్నాడు అనేది సగటు ప్రేక్షకుడికి అర్ధం కాదు . ప్రస్తుతం తీసిన ఈ మూవీను లేటెస్ట్ జనరేషన్ కు తగ్గట్లు కూడా తీయచ్చు .ప్రస్తుతం ఇండస్ట్రీలో స్నేహం గురించి వచ్చిన అన్ని సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు .లేటెస్ట్ గా వచ్చిన ఉన్నది ఒక్కటే జిందగీ మూవీకు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు .అంతగా ప్రేక్షకులను స్నేహం మీద వచ్చే మూవీలు ఆకట్టుకుంటున్నాయి .అయితే ఈ రోజు శుక్రవారం వచ్చిన మూవీలో మాత్రం వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని తీయడంలో విఫలమయ్యాడు దర్శకుడు . ఇందిరతో చనువుగా ఉంటున్న విషయం తెలుసుకొని మోహన్ ఊరి నుండి వెళ్ళిపోయినా తర్వాత కథ ఆసాంతం అతని చుట్టూనే తిరుగుతుంది కానీ చలపతి పాత్ర అసలు కన్పించదు .అయితే ఈ క్రమంలోనే చిన్ననాటి స్నేహితులు మరల ఎప్పుడు కలుస్తారు అనే ఆత్రుతను దర్శకుడు ప్రేక్షకుడికి కల్పిస్తే బాగుండేది .సిల్వర్ స్క్రీన్ పై సన్నివేశాలు నడుస్తున్న కథనం తీరు సగటు ప్రేక్షకుడ్ని ఆకట్టుకోలేకపోయాయి . ఆఖరికి ఇద్దరు కల్సే సమయంలో హృదయాలను హత్తుకునేలా ఉండి ఉంటె బాగుండేది .అసలు ఈ మూవీలో కేవలం తుపాకీ కోసం పోలీసుల వెతుకులాట.. చలపతిపై పగను పెంచుకున్న ప్రత్యర్థులు.. ఇవన్నీ అసలు కథకు తగ్గట్లు లేదు . ఎండింగ్ లో టైమ్ బాంబు నేపథ్యంలో నడిచిన సంఘటనలు రక్తికట్టించాల్సింది.కానీ అలా జరగలేదు .
మరి ఎవరెలా చేశారంటే:
ఈ మూవీలో హీరో శివబాలాజీది ప్రాధాన్యం ఉన్న పాత్ర. ఆ పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేశాడు. గుబురు గడ్డంతో ఒక కొత్త లుక్‌లో కనిపించాడు. పూల రంగడు తరహా పాత్రలో రాజీవ్ కనకాల దర్శనమిస్తాడు. ఆయన పాత్రే కాస్త హాస్యాన్ని పండిస్తుంది. కథానాయిక పాత్రకు సినిమాలో అంతగా ప్రాధాన్యం లేదు. ఆమె ఉన్న సన్నివేశాలు కూడా తక్కువే. సత్య కాస్త రిలీఫ్‌ను ఇస్తాడు. చలపతిరావు, షఫీవి చిన్న చిన్న పాత్రలు. సాంకేతికంగా చూస్తే 1982 నేపథ్యంలో సాగిన కథను అప్పటి వాతావరణానికి తగ్గట్టుగా సన్నివేశాలను డిజైన్ చేశారు. ఫొటోగ్రఫీ ఒక కొత్త టోన్‌లో సాగుతుంది. రెండు ఐటమ్ గీతాలు ఉన్నా, ఒక్కటీ హుషారు పరిచేలా లేదు. సంభాషణలు మరింత షార్ప్‌గా రాయాల్సింది. సాధారణ కథే అయినా, దాన్ని మరింత ఆకట్టుకునేలా దర్శకుడు తీర్చిదిద్దటంలో విఫలమయ్యాడు .
బలాలు
+ శివబాలాజీ, రాజీవ్ కనకాల
+ సత్య కామెడీ
బలహీనతలు
– కథ, కథనం
– రేటింగ్ : 1.5 /5
– దరువు పంచ్ లైన్ : స్నేహమేరా జీవితం- 1982నాటి కథే తప్ప నేటి జనరేషన్ కు ఎక్కని స్నేహం ..
