టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీచ్చిన మొదట్లో కథానాయికగా పలు సినిమాల్లో నటించి ఇటు తన అందచందాలతో అటు అభినయంతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న ముద్దుగుమ్మ అర్చన .ఆ తర్వాత పలు సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తూ వస్తుంది .తాజాగా ఒక ప్రముఖ వెబ్ సిరిస్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో పలు సంచలనాత్మక విషయాలను తెలిపారు .
ఒక ప్రముఖ దర్శకుడు అర్చన చూడటానికి చాలా అందంగా ఉంటుంది .చూడగానే మత్తెక్కిస్తుంది అని కామెంట్లు చేశారు . దానిపై మీ సమాధానం ఏమిటి అని ప్రశ్నించగా అర్చన మాట్లాడుతూ ఈ తరహ విమర్శను నేను మొట్ట మొదటిసారిగా వింటున్నాను .. ఇంతవరకూ నాతో ఎవరూ అనలేదు. సక్సెస్ అనేది కనుక ఉంటే అన్నీ కొట్టుకుపోతాయి అనే విషయం మీకు తెలుసు కదా. ఆ డైరెక్టర్ కి నేను నాజూకుగా కనిపించలేదేమో. ఇక్కడ రకరకాలుగా చెప్పుకోవడం మామూలే. పెద్ద పెద్ద వాళ్లే ఇలాంటి విమర్శలను ఫేస్ చేయవలసి వచ్చింది .. నేనెంత?” అన్నారు.