ఇండస్ట్రీలో మొదటిగా డాన్స్ మాస్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత నటుడుగా ..దర్శకుడిగా ..హీరోగా తనకే సాధ్యమైన విలక్షణ పాత్రలతో అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు రాఘవ లారెన్స్ .ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పలు సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు .
ఈ నేపథ్యంలోనే ది లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే పలు సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు .ఈ ట్రస్ట్ ద్వారా నూట నలబై ఒక్కటి ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించారు .అంతే కాకుండా సోషల్ మీడియాలో తన అధికారక పేజిలో ఎవరైనా ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు తనకు కాల్ చేయాలంటూ తన పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ను పోస్టు చేశాడు .
తాజాగా ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్ధి అనిత కుటుంబానికి పదిహేను లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించి అందరి మనస్సులను గెలుచుకున్నాడు .ఈ సందర్భంగా అనిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కూతురు చనిపోయి పుట్టెడు కష్టాల్లో ఉన్న తమకు అండగా నిలవడమే కాకుండా పది హేను లక్షల రూపాయలను ఆర్ధిక సహాయం ప్రకటించి మాకు దేవుడైయ్యాడు అని అన్నారు .. తాజాగా శివాని అనే పాట హార్ట్ లో హోల్ ఉండటంతో ఆ పాపకి ఆపరేషన్ చేయించాడు. ఇది కూడా సక్సెస్ అయిందంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు లారెన్స్ ..