ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న నంది అవార్డుల రగడలో కాంట్రవర్సిటీకా బాప్ మిస్టర్ జీనియన్ ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. అప్పటికే దుమారం రేగుతున్న కమ్మనేన నందుల విషయం పై వర్మ స్పందిస్తూ నంది అవార్డ్స్ మొత్తం చూశానని.. దిమ్మతిరిగి పోయిందని.. సెలక్షన్‌లో ఒక్కశాతం కూడా పక్షపాతం లేకుండా నిజాయితీగా ఇచ్చిన అవార్డులని ఇలాంటి కమిటీ ప్రపంచంలో ఏ మూలన కూడా ఉండదని.. ఇంత నిజాయితీగా నంది అవార్డులు ఇచ్చినందుకు ఆ కమిటీ వారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని వ్యంగంగా తన ఫేస్‌బుక్ పేజీలో ఒక పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే.
అయితే వెంటనే రామ్ పెట్టిన పోస్టుకు.. నంది అవార్డు కమిటీలలో ఒకడైన దర్శకుడు మద్దినేని రమెష్ తనదైన పచ్చ బూతులతో.. ఒక పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా రమ్మీ నా కొడకా బర్మా నా కొడకా తెలుగుజాతి ఖర్మ నా కొడకా.. నిజాయితీగా పనిచేసిన మా కమిటీ గురించి మాట్లాడితే ఎవడికి ఏం కొయ్యాలో అది కోస్తాం రేయ్ అంటూ బెదిరిస్తూ కొన్ని వల్గర్ పదాలు కూడా ఆ పోస్టులో వాడారు మద్దినేని రమేష్. అయితే అలాంటి పోస్టులకు ఇంకెవరైనా అయితే భయపడుతారు.. ఇక్కడ ఎవరు రామ్ గోపాల్ వర్మ కాదా.. ఆ జీనియస్ ఏం చేశాడో తెలుసా సింపుల్‌గా నంది అవార్డుల పై నంది పాడిన పాట అంటూ ఒక ఐటమ్ సాంగ్‌ని పెట్టారు.
ఇక ఆ పాట లిరిక్స్ ఇలా ఉన్నాయి… ఒకటా.., రెండా.., తొమ్మిదీ.., మరి ఒకటే నేను నందిని.. ఇష్టమొచ్చినట్లు పంచుకోవడం మాకు ఇష్టం… మేము చెప్పినట్లు తల ఊపూ నందీ.. ఇంకెందుకు నందులు.. ఎందుకో?.. అంకెలు చూస్తే తొమ్మిది మా కోరిక మాత్రం కమ్మది.. గంగిరెద్దులాగ నన్ను చూడకండి.. అక్కడక్కడే తిప్పకండి.. అడ్డు వచ్చేవారు లేరు మాకు పచ్చ జెండా ఊపుతాము మేమూ.. అంటూ పాత సినిమాలోని జయమాలిని నర్తించి రంజింప జేసిన ఒక ఐటం సాంగ్‌ని.. తాజాగా ప్రకటించిన నంది అవార్డులకు తనదైన శైలిలో.. తనకు మాత్రమే సాధ్యమైన లిరిక్స్‌తో లింక్ చేస్తూ వర్మ ఒక పోస్టు పెట్టుడు. దీంతో వర్మ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వాయు వేగంతో వైరల్ అవుతోంది. మరి దీని పై కమ్మనైన వారు ఎలా స్పందిస్తారో చూడాలి.
నంది అవార్డులపై నంది విగ్రహం పాడిన పాటతారాగణం:-నందిగా: జయమాలినికమిటీ సభ్యులుగా: రాజబాబు, పద్మనాభం, రావు గోపాల రావు తదితరులు
Posted by RGV on Friday, 17 November 2017