టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ భక్తులలో ఒకరైన నటుడు నిర్మాత అయిన బండ్ల గణేష్‌కి ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీకి రెమ్యునరేషన్‌గా ఇచ్చిన చెక్ బౌన్స్ అవడంతో ఆయన కోర్టులో కేసువేశారు. ఇక ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. బండ్ల గణేష్‌కు జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా కూడా విధించింది.
అయితే ఇక్కడ సోషల్ మీడియాలో ట్రాల్ అవుతున్నా షాకింగ్ వార్త ఏంటంటే.. ఏపీ సర్కార్ ఇటీవల ప్రకటించి నంది అవార్డుల రగడ పై బండ్ల గణేష్ తీవ్రంగా స్పందించారు. ఈ అవార్డుల జాబితాలో మెగా హీరోలకు అన్యాయం జరిగిందని అన్నారు. ఇచ్చినవి నంది అవార్డులు కాదని, సైకిల్ అవార్డులంటూ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా, జ్యూరీ సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఉత్తమ నటుడి అవార్డు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. కంటితుడుపు చర్యగా చిరంజీవికి రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చారని ఆరోపించారు. మగధీర సమయంలోనూ ఇలానే చేశారని గణేష్ ఆరోపించారు. దీంతో టీడీపీ నేతలే గణేష్ పాత కేసును వెతికి పెట్టి మరీ జైలు శిక్ష పడేలా చేశారని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.