వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం కర్నూలు జిల్లాలో జరుగుతుంది. ఈ ప్రజాసంకల్ప యాత్ర 23వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం బిల్లకల్ నుంచి పాదయాత్రను ప్రారంభిచి సాయంత్రం నాలుగు గంటలకు పత్తికొండలోని ఊరు వాకిలి సెంటర్ వద్ద బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిచారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరు అయినా సంతోషంగా ఉన్నారా?. మళ్లీ మనకు ఎన్నికలు వచ్చేసరికి మనకు ఎలాంటి నాయకుడు కావాలని మన మనస్సాక్షిని అడగాలి. మోసాలు చేసే నాయకుడు, అబద్ధాలు చెప్పే నాయకుడు కావాలా అనేది మీరే ఆలోచించుకోండి. చంద్రబాబు ప్రభుత్వంలో అంతా అవినీతే….మళ్లీ 2019 ఎన్నికలు అప్పుడు మీరు గుర్తుకు వస్తారు. అప్పుడు వచ్చి మేము అధికారంలోకి వస్తే.. ఇంటికోక్క కేజీ బంగారం.. ఇంటికోక్క కారు అని తప్పుడు హమీలు ఇస్తారు. కనుక మీరు ఒక్కసారి ఆలోచించాలి అని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
