జనసేన అధినేత టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని పరిటాల రవి చితక్కొట్టి మరీ గుండు కొట్టించాడనే వార్తో ఇంటర్‌నెట్‌లో వైరల్ అయ్యి పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పవన్ క్లారిటీ ఇచ్చారు. విజయవాడలో జనసేన కార్యకర్తలతో మాట్లాడుతూ.. ఒకరోజు తాను తమ్ముడు సినిమా షూటింగ్‌లో ఉండగా.. మా నాగబాబు అన్నయ్య నాకు ఫోన్ చేసి.. పరిటాల రవి నిన్ను తీసుకెళ్లారా అని అడిగారు.. దీంతో వెంటనే పరిటాల రవి ఎవరు అని అడిగాను.. తనకు కొంతమంది టీడీపీ వారు ఫోన్ చేశారని చెప్పారు.
దీంతో నేను షూటింగ్‌లో ఉన్నానని నన్నెవరు తీసుకెళ్ళలేదని చెప్పానని తెల్పారు. అంతే కాకుండా నన్ను చితక్కొట్టి పరిటాల రవి గుండు గీయించారని కొందరు రాశారు. అయితే వాటిలో ఏమాత్రం నిజం లేదని.. వాటిని టీడీపీ నేతలే క్రియేట్ చేశారని.. నేను మరో ఉద్దేశంతో జుట్టు తీయించుకున్నానని చెప్పారు. ఇక టీడీపీ నుంచి ఇన్ని అవమానాలు జరిగినప్పటికీ నేను వ్యక్తిగతంగా తీసుకోలేదని.. ఇవన్నీ నేను మనసులో పెట్టుకోలేదని అన్నారు. దీంతో ఎప్పటి నుంచో పవన్ పై ఈ గుండు కథనం ప్రచారంలో ఉంది.. ఇప్పటికి పవన్ క్లారిటీ ఇచ్చారు.. అయినా కూడా చాలా మంది పవన్‌కు నిజంగానే పరిటాల రవి గుండుకొట్టించారని ఇప్పటికీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం గమనార్హం.