ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 42వ రోజుకు చేరుకుంది. ఇక జగన్ పాదయాత్రకు అధికారం పక్షం ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. జగన్ మాత్రం మొండిగా దూసుకుపోతున్నారు. ఇక పాదయత్రికి బ్రహ్మరథం పడుతున్న జనం నుండి వేల కొద్దీ దరఖాస్తులు.. ఇబ్బడి ముబ్బడిగా వినతులు జగన్ చెంతకు వస్తున్నాయట. ఇప్పటి వరకూ జగన్ వద్దకు దాదాపు నలభై వేలకు పైగా వినతులందినట్లు చెబుతున్నారు. అంటే రోజుకు వెయ్యికి పైగానే వినతులు జగన్ వద్దకు వస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా తమకు పక్కా ఇళ్లు లేవని, పింఛను రావడం లేదని, రుణాలు అందడం లేదని, పంటలకు గిట్టుబాటు ధరలు లేవని, ఉపాధి అవకాశాలు లేవని ఇలాంటివే ఎక్కువ సంఖ్యలో వినతులు వస్తున్నాయి. తమకు ఉద్యోగం లేదని, ఇప్పించాలని వ్యక్తిగత దరఖాస్తులు కూడా వీటిలో ఉన్నాయి. అలాగే ఆరోగ్య సమస్యలు, శస్త్ర చికిత్సకు నిధులు మంజూరు చేయాలన్న వినతులూఉన్నాయి. అయితే వీటన్నింటినీ వైసీపీ కార్యాలయం సిబ్బంది కేటగిరీలుగా విభజించి కంప్యూటరీకరిస్తున్నారు.
దీంతో అధికారంలోకి వచ్చిన వెంటనే తన పాదయాత్రలో వచ్చిన వ్యక్తిగత, సామూహిక సమస్యలను పరిష్కరించాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. అందుకే ఎప్పటికప్పుడు వచ్చిన వినతులను వెంటనే కంప్యూటరీకరించాలని, వాటిని జిల్లాల వారీగా ఫైల్ చేయాలన్న ఆదేశాలు సిబ్బందికి అందాయని సమాచారం. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. జగన్ ఈ పనులన్నీ నైట్‌కి నైటే.. అంటే తన వద్దకు ఏరోజుకి ఆరోజు వచ్చే వినతులు అన్నీ విభజించుకొని వాటి పరిష్కారాని తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారట.. ఇదండీ అసలు మ్యాటర్.. ఇక జగన్ పాదయత్ర ప్రస్తుతం అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో జరుగుతుండగా.. ఆయన ఇప్పటి వరకూ కడప, కర్నూలు, నుండి అనంతపురం జిల్లాల్లో పాదయాత్ర
సాగుతోంది.