Home / ANDHRAPRADESH / ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు పవర్ ఫుల్ షాక్‌..మూడో భార్య సంచల నిర్ణయం..

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు పవర్ ఫుల్ షాక్‌..మూడో భార్య సంచల నిర్ణయం..

జ‌న‌సేన అధినేత‌.. టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్… ఒక‌వైపు సినిమాలు, మ‌రోవైపు రాజ‌కీయాలతో బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు. అయితే తాజా సినీ రాజ‌కీయాల‌కు సంబంధం లేని ఒక వార్త సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఇప్ప‌టికే త‌న పెళ్లిళ్ళ పై అనేక ర‌చ్చ‌లు జ‌రుగున్న టైమ్‌లో తాజాగా ప‌వ‌న్‌ ఇప్పుడు మ‌రొక కొత్త చిక్కు వ‌చ్చిప‌డింది. ప‌వ‌న్ మూడ‌వ భార్య అన్నా లెజీనోవో విడాకులు ఇచ్చేందుకు సిద్ధ‌మైందంట‌. ఈ న్యూస్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో గిర్రున తిరుగుతోంది.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. మొద‌ట పెద్దలు నిశ్చయించి పెళ్లి చేసిన నందినిని పలు కారణాల వల్ల దూరం చేసుకున్నాడు. ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత పవన్‌ సహనటి రేణు దేశాయ్‌తో సహజీవనం చేశాడు. ఒక బాబు పుట్టిన తర్వాత రేణు మెడలో తాళి కట్టాడు. కొన్నాళ్లకే పలు కారణాల వల్ల రేణుకు కూడా విడాకులు ఇచ్చాడు. ప్రస్తుతం మూడో భార్య రష్యాకు చెందిన అన్నాలెజినోవాని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ప్ర‌స్తుతం ఇద్ద‌రు పిల్ల‌లు. దీంతో ప‌వ‌న్ మూడో రిలేష‌న్ అన్నా నిల‌బ‌డింది అనుకునే లోపే మూడో భార్య కూడా పవ‌న్‌కు విడాకులు ఇచ్చే ఆలోచనలో ఉందనే టాక్ బయ‌ట‌కు రావ‌డంతో ఒక్క‌సారిగా సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

అస‌లు ఆమె ఆ నిర్ణ‌యం ఎందుకు తీసుకుందంటే.. ప‌వ‌న్ ఒక‌వైపు జనసేన అంటూ రాజ‌కీయాలు, మ‌రోవైపు ప‌వ‌ర్ స్టార్ అంటూ.. సినిమాలు ఇదే అత‌ని ప్ర‌పంచం అయిపోయింద‌ట‌. ఫ్యామిలీని పూర్తిగా మర్చిపోయాడట. దీంతో ఎలాగూ తమను పక్కకు పెడుతున్నాడు కాబట్టి తాను కూడా పవన్‌ నుండి దూరం అయి పిల్లలను రష్యాకు తీసుకు పోయే ఆలోచన చేస్తోందని పవన్‌ సన్నిహితుల ద్వారా ఒక వార్త బ‌య‌ట‌కి వ‌చ్చింద‌ని సోష‌ల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఇక పవన్‌ కూడా మాట్లాడుతూ.. ఒక్కడినే ఉన్నా, ఉంటే ఉంటా పోతే పోతా అని చెప్పాడు. అంటే మూడో భార్యతో విడిగా ఉండాలనే ఆలోచనలో పవన్‌ ఉన్నట్టు ఆమాటల్లోనే తెలుస్తోంది. దీంతో మొత్తానికి పవన్‌ మూడో భార్య కూడా విడాకులు ఇవ్వడానికి సిద్దమవుతుంది అనగానే కొంత‌మంది పీకే ఫ్యాన్స్ మాత్రం తెగ కంగారు పడిపోగా.. మ‌రికొంత మంది ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ప‌వ‌న్ పెళ్లిళ్ళు-విడాకులు సోష‌ల్ మీడియాలో త‌ర‌చూ వైర‌ల్ అవుతున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat