నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ప్రముఖ యాంకర్ ప్రదీప్ ఈ రోజు కౌన్సెలింగ్ కు డుమ్మా కొట్టాడు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన అందరికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చామని ట్రాఫిక్ అదనపు డీసీపీ అమర్‌కాంత్ రెడ్డి తెలిపారు. అయితే ప్రదీప్ ఇవాళ నిర్వహించిన కౌన్సెలింగ్‌కు హాజరు కాలేదని డీసీపీ చెప్పారు. అయితే కౌన్సెలింగ్ కు హాజరు కావడానికి శుక్రవారం వరకు టైం ఉంది, కాబట్టి ప్రదీప్ కౌన్సెలింగ్‌కు ఎప్పుడు వస్తాడో తెలియదు అని అన్నారు .
