ఏపీలో ఇప్పుడు ఒక వార్త తెగ చక్కర్లు కొడుతుంది .ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అంటూ సోషల్ మీడియా లో ప్రస్తుతం ఈ వార్త తీవ్ర ఉత్కంఠను లేపుతుంది.రాష్ట్రంలో డీ ఫార్మాకు చెందిన విద్యార్ధినులు తమ హక్కులకై పోరాడుతున్న సంగతి తెల్సిందే .తమ సమస్యలను పరిష్కరించాలని గత ఆరు రోజులుగా నిరాహార దీక్షలను చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయకపోతే మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటామని మెడకు ఉరి వేసుకుంటాం అని తాడులతో నిరసనలను వ్యక్తం చేస్తున్నారు .అయితే ఇప్పటికే ఫాతిమా నర్సింగ్ విద్యార్ధినులు తమ సమస్యలపై పరిష్కారం కోసం గత మూడు ఏండ్లుగా అలుపు ఎరగని పోరాటం చేస్తున్నారు .