ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ కత్తి మహేష్,పవన్ కళ్యాణ్ ,పూనమ్ కౌర్ మధ్య వార్ .తాజా పరిస్థితుల నేపథ్యంలో పవన్ కత్తిల మధ్య నెలకొన్న వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో అర్ధం కాక ఇటు పవన్ ఫ్యాన్స్ అటు కత్తి మద్దతుదారులు తల పీక్కుంటున్నారు .అందులోభాగంగా నిన్న ఆదివారం హైదరాబాద్ మహానగరంలోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన కత్తి మహేష్ పెద్ద దుమారాన్నే లేపాడు .
ప్రెస్ క్లబ్ లో మహేష్ మాట్లాడుతూ పవన్ ను దమ్ముంటే ప్రెస్ క్లబ్ కు రావాలని విసిరిన సవాలుతో..వీరిమధ్య నెలకొన్న వివాదం క్లైమాక్స్‌కు చేరుకుందనే అంతా అనుకున్నారు .కానీ లైవ్ లో మీడియాతో కత్తి చేసిన సంచలన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఇలాంటి తరుణంలో హీరోయిన్ పూనమ్ కౌర్ కత్తి మహేష్‌కు, ఆయన తల్లికి మద్దతుగా పూనమ్ ఒక ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆదివారం జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో డైరెక్టర్ వివేక్.. కత్తి మహేష్ తల్లి గురించి ప్రశ్నలు లేవనెత్తాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం ఇష్టం లేక కత్తి మహేష్ అక్కణ్నుంచి బయటకు వచ్చేశాడు. దీంతో సోషల్ మీడియాలో కత్తి మహేష్ తల్లి గురించి ట్వీట్లు, కామెంట్లు ఎక్కువయ్యాయి. వీటి గురించి పూనమ్ స్పందిస్తూ.. `ఎవరైనా కానీ, ఒక వ్యక్తి తల్లిని కించపరుస్తూ ఎవరూ మాట్లాడకూడదు. దయచేసి ఆమె గురించి మాట్లాడకండి` అని పూనమ్ ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తుంది .
Who ever this is you are not going to degrade any ones mother ! I sincerely request ! Plz https://t.co/apmWDhSeu0
— Poonam Kaur Lal (@poonamkaurlal) January 7, 2018