Home / MOVIES / ఓవ‌ర్ నైట్ స్టార్ ఊరికే అయ్యానా.. వివాదం పై ప్రియా ర‌ఫ్ ఆన్స‌ర్‌..!

ఓవ‌ర్ నైట్ స్టార్ ఊరికే అయ్యానా.. వివాదం పై ప్రియా ర‌ఫ్ ఆన్స‌ర్‌..!

సోష‌ల్ మీడియా సంచ‌ల‌నం ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌.. రాత్రికి రాత్రే వైరల్ స్టార్‌గా మారి న‌యా ట్రెండ్ క్రియేట్ చేసింది. అయితే ఒక చిన్న వీడియో క్లిప్‌.. ప్రియాకి ఫేమ్‌తో పాటు వివాదం కూడా తెచ్చిపెట్టిన‌ సంగతి తెలిసిందే. ముస్లింల సాంప్రదాయ పాటలో ఆమె హావభావాలు అసభ్యంగా ఉన్నాయంటూ కొందరు హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియా ప్రకాష్ ముస్లింల మనోభావాలను దెబ్బ తీసిందని ఆరోపించారు. ఆమెతో పాటు నిర్మాత పై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.

అయితే తాజాగా ఈ వివాదం పై ప్రియా ప్రకాశ్ స్పందించింది. ఈ పాటను ఇంతమంది ఆదరిస్తారని నేను అస్సలు భావించలేదని… దేశవ్యాప్తంగా ఇంతమంది ఇష్టపడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపింది. ఆ పాటలో ముస్లింల మనోభావాలను మీరు కించపరిచారనే ఆరోపణల పై మీరేమంటారని ప్రశ్నించగా.. ఆ కేసు గురించి నాకు పెద్దగా తెలీదని… డైరెక్టర్ చెప్పిందే చేశానని ప్రియా చెప్పింది. ఆ పాటలో మీ హవభావాలు అసభ్యకరంగా ఉన్నాయని కూడా ఫిర్యాదు చేశారని చెప్ప‌గా.. అందులో ఎలాంటి అసభ్యత లేదని… దీన్ని అనవసరంగా వివాదం చేస్తున్నారని… అది ముస్లిం సాంప్రదాయ గీతమని మాత్రం తెలుసని, దాన్ని అవమానించామని మేం భావించడం లేదని ప్రియా తేల్చి చెప్పింది.