Home / MOVIES / క‌న్నుకొట్టే సీన్.. కిస్సింగ్ సీన్‌లు చూసిన‌.. ప్రియా త‌ల్లి దండ్రులు ఏమ‌న్నారో తెలుసా..?

క‌న్నుకొట్టే సీన్.. కిస్సింగ్ సీన్‌లు చూసిన‌.. ప్రియా త‌ల్లి దండ్రులు ఏమ‌న్నారో తెలుసా..?

సోషల్ మీడియాలో గత వారం రోజులుగా ఒక కుర్ర‌ హీరోయిన్ పేరు తెగ మార్మోగిపోతోంది. రంగుల ప్ర‌పంచంలోకి రాకెట్‌లా దూసుకొచ్చిన ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ సోష‌ల్ మీడియాని ఊపేస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌, యూట్యూబ్ ఇలా ఎక్కడ చూసినా ఓరు ఆధార్ లవ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ గురించే. ఒకే ఒక్క టీజర్‌తో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్ గురించి తాజాగా సంచ‌ల‌న వార్త ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఒరు ఆధర్ లవ్ సాంగ్‌లో ఒక చిన్నక్లిప్ వ‌ద్ద క‌న్న‌కొట్ట‌డ‌మే కాంకుండా తన వెరైటీ కనుచూపులతో.. సైగలతో చిన్నా చిత‌కా.. ముస‌లీ ముత‌కా మొత్తాన్నిమెస్మరైజ్ చేసింది. ఇక ప్రియా క‌న్ను కొట్టే సీన్‌కే త‌ట్టుకోలేక పోతుంటే.. వెంట‌నే ల‌వ‌ర్స్‌డే రోజున టీజ‌ర్ వ‌దిలారు. ఆ టీజ‌ర్‌లో తన రెండు వేళ్ళతో పెదాల నుండి ఒక కిస్సును బయటకు లాగి.. త‌న రెండు చూపుడు వేళ్లనే తుపాకీలా పెట్టి ఆమె త‌న ప్రేమ బుల్లెట్‌ ఆ కుర్ర హీరో రోషన్ అబ్దుల్ పైకి పేల్చింది. ఇంకేముంది.. ఆ కుర్రాడే కాదు.. చాలామంది ఇప్పుడు ఆ తుపాకీ నుండి వచ్చిన తూటా దెబ్బకి గింగిరాలు తిరిగి మైకంలో పడ్డారు. దీంతో మరోసారి ఇంటర్నెట్లో ఈ టీజర్ వైరల్ అయిపోయింది. అయితే తాజాగా ప్రియా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆ సీన్ల పై మీ త‌ల్లి దండ్రులు ఎలా స్పందించార‌ని ప్ర‌శ్నించ‌గా ప్రియా ఇంకొంచెం క్యూట్‌గా ముఖం పెట్టి వాళ్ళు చాలా సంతోష ప‌డ్డార‌ని.. అయితే ఒక్క‌సారిగా త‌న‌కు ఇంత ఫేమ్ రావ‌డంతో వాళ్లు ఇంకా న‌మ్మ‌లేక‌పోతున్నార‌ని చెప్పింది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat