టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావుకు ప్రమాదం జరిగింది.నరేష్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ సినిమాలో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.చిత్రం చిత్రీకరణలో భాగంగా గురువారం సాయంత్రం నటుడు చలపతి బస్సు వెనక ఉండే నిచ్చెన ఎక్కుతూ ప్రమాదశావత్తు జారి కిందపడ్డారు .అయితే బస్సు మీద నుండి ఆయన పడటంతో గాయాలయ్యాయి.వెంటనే చలపతిరావును నగరంలో జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం చికిత్స జరుగుతుంది.వైద్యులు ఆయన పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
