Home / Tag Archives: hyderabad

Tag Archives: hyderabad

ఐటీ నియామకాల్లో హైదరాబాద్‌ కు రెండోస్థానం

ఐటీ ఉద్యోగం కావాలంటే గతంలో టెకీలు బెంగళూరు, పుణె, చెన్నై, నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్సీఆర్‌), ముంబై లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఐటీ శిక్షణతోపాటు నియామకాల్లోనూ హైదరాబాద్‌ గణనీయ అభివృద్ధి సాధించింది. కరోనా వల్ల తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశంలో ఈ ఏడాది మార్చి-ఆగస్టు మధ్యకాలంలో జరిగిన ఐటీ ఉద్యోగుల నియామకాల్లో హైదరాబాద్‌, పుణె నగరాలు చెరో 18 శాతంతో …

Read More »

మంత్రి కేటీఆర్ మరో కీలక నిర్ణయం

ప్రతీ ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి పది వరకు వాహనాల రాకపోకలను నిలిపేసి కేవలం సందర్శకులు ఆహ్లాదంగా గడిపేలా చర్యలు చేపట్టిన మంత్రి కేటీఆర్‌.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఆదివారం ట్యాంక్‌బండ్‌పై నగర పౌరులు కుటుంబ సభ్యులతో సందడి చేశారు. సందర్శకులు కుటుంబ సభ్యులతో గడిపిన తీరుపై పలు ఫొటోలను ట్విటర్‌లో పోస్టు చేసిన కేటీఆర్‌ సందర్శకులకు మరింత ఆనందం కలిగించేలా హుస్సేన్‌సాగర్‌లో లేజర్‌ షో …

Read More »

హైదరాబాద్‌.. తయారీ హబ్‌

తయారీ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో హైదరాబాద్‌ మహానగరం దేశంలోనే ముందంజలో ఉందని జేఎల్‌ఎల్‌ నివేదిక వెల్లడించింది. భారతీయ సిలికాన్‌ వ్యాలీగా పిలిచే బెంగళూరు తర్వాత రెండో సిలికాన్‌ వ్యాలీగా హైదరాబాద్‌ నిలిచింది. ఐటీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా మారింది. ముఖ్యంగా దేశంలోనే స్టార్టప్‌లకు హబ్‌గా హైదరాబాద్‌ ఎదిగింది. ఐటీ రంగంతోపాటు ఫార్మా, బయోటెక్‌, ఏరోస్పేస్‌, రక్షణ, ఈఎస్‌డీఎం, మెడికల్‌ డివైజెస్‌ రంగాలకు సంబంధించిన విభాగాల్లో మంచి పనితీరును …

Read More »

పాత‌, కొత్త న‌గ‌రం అనే తేడా లేకుండా అభివృద్ధి : మంత్రి కేటీఆర్

ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో బ‌హుముఖ‌మైన అభివృద్ధి జ‌రుగుతోంద‌ని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. పాత‌, కొత్త న‌గ‌రం అనే తేడా లేకుండా హైద‌రాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. మ‌ల‌క్‌పేట నియోజ‌క‌వ‌ర్గంలోని పిల్లిగుడిసెలు బ‌స్తీలో నూత‌నంగా నిర్మించిన 288 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ప్ర‌సంగింస్తూ.. డ‌బుల్ బెడ్రూం ఇండ్ల ల‌బ్దిదారుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ …

Read More »

పెళ్లైన అమ్మాయితో ప్రేమ వద్దన్న పాపానికి

పెళ్లైన అమ్మాయితో ప్రేమ వద్దన్న పాపానికి స్నేహితుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడిన ఘటన నగరంలోని చోటు చేసుకుంది. పాతబస్తీ రియాసత్ నగర్‌కు చెందిన అక్బర్ ఖాన్ పెళ్ళైన మహిళతో ప్రేమ అంటూ వెంటపడ్డాడు. విషయం తెలిసిన ఆమె భర్త…అక్బర్ స్నేహితుడైన మహమ్మద్ ఈస సహాయం కోరాడు. తన భార్య వెంటపడవద్దని అక్బర్‌కు చెప్పాలని ఈసను కోరాడు. దీంతో మహిళ వెంటపడవద్దని ఈస నచ్చ చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం …

Read More »

 తెలంగాణ ఉన్నత విద్యామండలి నూతన చైర్మన్‌గా ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి

 తెలంగాణ ఉన్నత విద్యామండలి నూతన చైర్మన్‌గా ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి నియమితులయ్యారు. మండలి వైస్‌ చైర్మన్‌-1గా ఉన్న ఆయనను కౌన్సిల్‌ నూతన అఫిషియేటివ్‌ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో లింబాద్రిని నియమిస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులిచ్చారు. ప్రొ ఫెసర్‌ పాపిరెడ్డి చైర్మన్‌ పదవీ బాధ్యతలను మంగళవారమే లింబాద్రికి అప్పగించారు. 2014 ఆగస్టులో ఉన్నత విద్యామండలిని …

Read More »

రూ. 1280 కోట్ల‌తో 17 ఎస్టీపీలు

హైదరాబాద్ మహాన‌గ‌రంలోని ఫ‌తేన‌గ‌ర్‌లో సీవ‌రేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. రూ. 317 కోట్ల‌తో 100 ఎంఎల్‌డీ సామ‌ర్థ్యంతో మురుగు నీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. దీంతో పాటు రూ. 1280 కోట్ల‌తో 17 ఎస్టీపీలు నిర్మించ‌బోతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. 17 ఎస్టీపీ కేంద్రాల్లో 376.5 ఎంఎల్‌డీల మురుగునీరు శుద్ధి చేస్తామ‌ని కేటీఆర్ ప్ర‌క‌టించారు.

Read More »

మూసీ నదికి కొత్త వన్నె

ఒక‌ప్పుడు మురికి కూపంతో ఉన్న మూసీ.. ఇప్పుడు త‌ళ‌త‌ళ మెరుస్తోంది. మూసీ న‌దీ తీరం ప‌చ్చందాల‌తో భాగ్య‌న‌గ‌రానికే కొత్త వన్నె తీసుకోస్తోంది. ప‌చ్చిక బ‌య‌ళ్ల‌తో.. సుంద‌రంగా ముస్తాబైంది. నాగోల్ ప‌రిధిలో మూసీ న‌దిని ర‌మ‌ణీయంగా తీర్చిదిద్దారు. ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకునేలా వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ జిమ్, పాక‌ల‌ను రూపొందించారు. 100 ఫీట్ల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను పంద్రాగ‌స్టు రోజున ఆవిష్క‌రించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా మూసీ రివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్ …

Read More »

జంటనగరాల్లో వైభవంగా బోనాల వేడుకలు

జంటనగరాల్లో బోనాల వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. నగరంలోని ఏ వీధిలో చూసినా బోనాల సందడే కనిపిస్తున్నది. భాగ్యనగరంలోనే వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు కనుల పండువలా సాగుతున్నాయి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆదివారన బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలివస్తున్నారు. గతేడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో కేవలం ఇండ్ల వద్దనే మొక్కులు చెల్లించారు. ఈసారి వైరస్‌ ఉధృతి కాస్త …

Read More »

సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శం…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జిహెచ్ఎంసి పరిధిలోని ఎనిమిది డివిజన్ లకు చెందిన 443 మంది కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.4,43,51,388 విలువ గల చెక్కులను ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని చింతల్ లోని కేఎంజి గార్డెన్ వద్ద కార్పొరేటర్లతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో అభివృద్ధి, …

Read More »