తమన్నా కుర్రకారు మతిని పోగొట్టే పాలమీగడ లాంటి అందం.సన్నజాజి తీగలా ఉండి తెలుగు సినిమా ప్రేక్షకులకు ,యువతకు నిద్ర లేకుండా చేసింది.కెరీర్ మొదట్లో అందరితో నటించిన ముద్దుగుమ్మ ఇటివల వచ్చిన బాహుబలి సిరీస్ తర్వాత కెరీర్ సన్నగిల్లిందని చెప్పాలి .ఇలాంటి తరుణంలో హీరోయిన్ గా ఎంట్రీపై అమ్మడు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒక ప్రముఖ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో అమ్మడు మాట్లాడుతూ పేరుకు మాది రంగు రంగుల జీవితం కానీ అందులో ఆనందం లేదు.
స్టార్ హీరోయిన్ అనగానే ఏసీ కార్లు ..రూమ్ లలో తెగ ఎంజాయ్ చేస్తుంటారు అని అందరు అనుకుంటారు.కానీ వాస్తవంగా అలా ఉండదు.అందరి కంటే తమ జీవితాలే సమస్యల వలయం అని తెలియదు.పొద్దున్న ఇంటి దగ్గర నుండి బయలు దేరిన దగ్గర నుండి మరల ఇంటికి చేరేలోపు ఎన్నో వందల కళ్ళు మాపై ఉంటాయి.
ఎఫైర్స్ అంటూ ..డేటింగ్ అంటూ లేని పోనీ వార్తలను స్ప్రెడ్ చేస్తారు.ఒకానొక సమయంలో ఉన్న దాంట్లోనే పరిపూర్ణ సంతోష జీవితాన్ని గడపటానికి వీలుండదు.పగలు అనక రాత్రి అనక షూటింగ్ లో పాల్గొనాలి .షాట్ రెడీ అనగానే అక్కడకి వెళ్ళి అది ఎండా వానా అని చూడకుండా నిలబడాలి ..ఒక్క ముక్కలో చెప్పాలంటే మేషన్ లో పడ్డ చెరుకు గడలా మా బ్రతుకులు అవుతాయి ..మరి జన్మ ఉంటె హీరోయిన్ గా రాకూడదు అనే ఆలోచన వస్తుంది అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు ..