Home / MOVIES / ఎన్టీఆర్ సినిమాలో ప్రియ ప్రకాష్ వారియర్ కు అవకాశం ..!

ఎన్టీఆర్ సినిమాలో ప్రియ ప్రకాష్ వారియర్ కు అవకాశం ..!

కేవలం ఒకే ఒక్క లుక్ తో దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువత మదిని కొల్లగొట్టిన భామ ప్రియ ప్రకాష్ వారియర్ .పట్టుమని ముప్పై సెకండ్లు కూడా లేని ఆ వీడియోలో ప్రియ ప్రదర్శించిన హావభావాలతో రాత్రికి రాత్రే టాప్ రేంజ్ కు దూసుకుపోయింది అమ్మడు.

ఆ ఒక్క వీడియోతో అమ్మడుకు మాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ అంటూ తేడా లేకుండా వరస అవకాశాలు వస్తున్నాయి.అందులో భాగంగా టాలీవుడ్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ మూవీ రీమేక్ లో అమ్మడుకు అవకాశమిచ్చారు ఆ మూవీ దర్శకుడు.

ప్రముఖ బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా నటిస్తున్న టెంపర్ రీమేక్ మూవీ “సింబా”చిత్రంలో అమ్మడు కథానాయికగా ఎంపికైనట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.రోహిత్ శెట్టి ఈ మూవీకు దర్శకత్వం వహిస్తున్నాడు.