ప్రముఖ నటుడు నాని హీరోగా అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మీర్ కథానాయికలుగ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కృష్ణార్జున యుద్ధం.ఈ సినిమా ఈ నెల 12 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.అయితే ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండటంతో సినిమాకు సంబంధించిన వీడియో సాంగ్ ప్రోమోస్‌ను చిత్ర యూనిట్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు .తాజాగా ఇవాళ దారి చూడు దమ్మూ చూడు మామ.. అంటూ సాగే వీడియో పాటని చిత్ర యూనిట్ విడుదల చేశారు. హిప్ హాప్ తమీజా సంగీతంలో రూపొందిన ఈ పాట సంగీత ప్రియులని ఎంతగానో అలరిస్తుంది.పెంచల్ దాస్ ఈ సాంగ్‌కి లిరిక్స్ అందించడమే కాకుండా పాడి అలరించడంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో దుమ్ములేపుతుంది.ఎక్కడ చుసిన ఈ పాటనే వినపడుతుంది.
