ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ నటి శ్రీ రెడ్డి పై సంచలన ట్వీట్ చేశారు.మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో తనకు సభ్యత్వాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ..శనివారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఫిలిం ఛాంబర్ కార్యాలయం ఎదుట శ్రీ రెడ్డి అర్ధనగ్న నిరసనకు దిగి సంచలనం రేపిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ వర్మ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.‘‘శ్రీరెడ్డి ఇప్పుడొక నేషనల్ సెలబ్రిటీ. ముంబైలో పవన్ కల్యాణ్ అంటే ఎవరో కూడా తెలియని జనాలు సైతం శ్రీరెడ్డి గురించే మాట్లాడుకుంటున్నారు’ అని వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
Sri Reddy has become a national celebrity..People in Mumbai,who don’t even know Pawan Kalyan are talking about Sri Reddy
— Ram Gopal Varma (@RGVzoomin) April 8, 2018