స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న నూతన చిత్రం నా పేరు సూర్య ..నా ఇల్లు ఇండియా.ఈ సినిమా వచ్చే నెల 4 న విడుదలకు సిద్దమవుతుంది.ఈ మూవీలో అల్లు అర్జున్ మిలిటరీ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడు.ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఇమ్మాన్యుయేల్ హిరోయిన్ గా నటిస్తుంది.రచయిత వక్కంతం వంశీ తొలిసారి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్నారు .
అయితే మూవీ షూటింగ్ చివరి దశకి చేరుకుంది. మెగాస్టార్ చిరంజీవి ఆదివారం అల్లు అర్జున్ ను సర్ ప్రైజ్ చేశాడు.సినిమా సెట్ లోకి వెళ్లి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. చిరంజీవి రాకతో చిత్ర యూనిట్ మొత్తం సంతోషం వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా చిరు దాదాపు అరగంట సేపు సినిమా సెట్ లోనే గడిపారని సమాచారం .మెగాస్టార్ విజిట్ కు సంబంధించిన ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది . ఆ ఫోటోలో అల్లు అరవింద్ కుడా ఉండటం విశేషం.