Home / SLIDER / ఘనంగా ఇంటర్నేషనల్ నర్సెస్ డే..!

ఘనంగా ఇంటర్నేషనల్ నర్సెస్ డే..!

తెలంగాణ రాష్ట్రంలో అందరికి ఆరోగ్యం అనే నినాదంతో నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్   31 జిల్లాల నుండి ప్రజారోగ్యంలో తమవిధులను నిర్వహిస్తూ ప్రజల మనలను పొందుతున్న నర్ససులను గుర్తించి వారిని ఘనంగా సన్మానించడంతో పాటు ఉత్తమ నర్సులు అవార్డులను అందజేశారు. ఈ క్రమంలో లక్ష్మణ్ రూడవత్ మాట్లాడుతూ తెలంగాణ నర్సెస్ ప్రజారోగ్యం కోసం గొంతెత్తుతున్నారు …మారిన జీవన ప్రక్రియలో మానవుని ఆహారపు అలవాట్లు కూడా మారినవిదానితోపాటు రోగాలు అదే స్థాయిలో పెరుగుతున్నాయి..ప్రస్తుతం ప్రభుత్వ వైద్యశాలలకు రోగుల తాకిడి పెరుగుతుంది..కానీ అందుకు తగ్గట్టు “మానవవనరుల సంఖ్యను కూడా ప్రభుత్వం పెంచాలి”..”సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న నర్సులకు కనీస వేతనం రూ.20,000 అమలు చేయాలని కోరారు”.

“అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ నర్సింగ్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలన్నారు.””ప్రజారోగ్యం మెరుగుపడేందుకు వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు”.జాతీయ ఆరోగ్య మిషన్ టెక్నికల్ కమిటీ సభ్యురాలు డాక్టర్ ప్రకాశమ్మ మాట్లాడుతూ, నర్సింగ్ వృత్తిలో ఎదిగేందుకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజారోగ్యం మెరుగుపడాలంటే ఆసుపత్రుల్లో సరిపడినంత మంది సిబ్బందిని నియమించాలన్నారు. ఒక్క గాంధి ఆసుపత్రిలోనే 1800 రోగులుండగా షిఫ్టుకు కేవలం 60 మంది చొప్పున నర్సులున్నారని, ఇలా అయితే ఏ విధంగా సేవలందించగలుగుతామని ఆమె ప్రశ్నించారు.

నర్సుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర బేవరేజస్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ దేవీప్రసాద్‌ అన్నారు. నర్సింగ్‌ ఆపీసర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం రవీంద్రభారతిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యమ్రానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. నర్సుల ఖాళీ భర్తీకి ప్రభుత్వం ఇదివరకే నోటిఫికేషన్‌ ఇచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో నర్సింగ్‌ డైరెక్టరేట్‌ ఏర్పాటుకు మంత్రి లక్ష్మారెడ్డి ఇప్పటికే హామీఇచ్చారన్నారు. కాంట్రాక్టు అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ విధానం రద్దు, అన్ని ప్రయివేటు ఆస్పత్రుల్లో కనీస వేతనం రూ.20 వేల అమలు తదితర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని దేవీప్రసాద్‌ హామీనిచ్చారు. కార్యక్రమంలో జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ వి.ప్రకాశ్‌,గెజిటెడ్ ఆఫీసర్స్ అస్సోసిషన్ అధ్యక్షుడు జూపల్లి రాజేందర్ గారు, నర్సింగ్‌ మండలి రిజిస్ట్రార్‌ విద్యావతి, నర్సింగ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీను రాథోడ్, ప్రతినిధులు లక్ష్మణ్‌, నగేష్,తదితరులు భారీగా హాజరైన రాష్ట్ర నర్సెస్.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat